News April 24, 2025

సరస్వతి పుష్కరాల పనుల్లో ఎలాంటి జాప్యం జరగద్దు: BHPL కలెక్టర్

image

సరస్వతి పుష్కరాల పనుల్లో ఎలాంటి జాప్యం జరగొద్దని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేక అధికారులను ఆదేశించారు. గురువారం సరస్వతి పుష్కర పనుల ప్రత్యేక పర్యవేక్షణ అధికారులు, తహశీల్దార్, ఎంపీడీవోలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. సరస్వతి పుష్కర పనులకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలని, పర్యవేక్షణ చేయలేక పోతే జిల్లా విడిచి వెళ్లాలని, జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Similar News

News April 25, 2025

నర్సాపూర్(జి): విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన గురువారం నర్సాపూర్(జి) మండలంలో జరిగింది. SI సాయికిరణ్ కథనం ప్రకారం.. డొంగర్గాం‌క చెందిన విజయ్(51) ఈనెల 11న జంగిపిల్లి చిన్నయ్య పొలంలో మోటర్ పనిచేయకపోవడంతో మోటర్ పరీక్షిస్తున్నారు. ఈ సమయంలో ట్రాన్స్‌ఫార్మర్‌‌కు తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లగా HYDలో చికిత్స అందించారు. బుధవారం ఇంటికి తీసుకురాగా.. గురువారం మృతిచెందాడు. బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.

News April 25, 2025

నియమ నిబంధనలు పాటించని ఆ ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు: డీఎంహెచ్‌వో

image

ములుగు జిల్లాలో ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో గోపాలరావు అన్నారు. గురువారం జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో యాజమాన్యాలతో డీఎంహెచ్‌వో సమావేశం నిర్వహించారు. ప్రైవేటు ఆసుపత్రులు తాము అందించే సేవలు,తీసుకునే ఫీజుల వివరాల తో కూడిన ధరల పట్టికను ఆస్పత్రులలో ఏర్పాటు చేయాలని అన్నారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కేసులు పెడతామన్నారు.

News April 25, 2025

NRML: భార్య ఇంట్లోంచి వెళ్లిపోయిందని భర్త సూసైడ్

image

కుభీర్ మండలం అంతర్నీ గ్రామానికి చెందిన సురేశ్(32) మిషన్ భగీరథ సంపులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. సురేశ్ అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహం చేసుకొని ఇల్లరికం ఉంటున్నాడు. ఈనెల 22న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్య వాళ్ల అక్క ఇంటికి వెళ్లిపోయింది. భార్య ఇంట్లోంచి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన సురేశ్ మిషన్ భగీరథ సంపులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

error: Content is protected !!