News November 20, 2024
సరిత తిరుపతయ్యకు కీలక పదవి?
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. కొత్త అధ్యక్షరాలిని నియమించాలని ఇటీవల ఏఐసీసీ కసరత్తు మొదలు పెట్టింది. అందులో భాగంగా గద్వాల మాజీ జడ్పీ ఛైర్పర్సన్ సరితా తిరుపతయ్యకు కీలక పదవి కట్టబెట్టనున్నట్లు సమాచారం. బీసీ సామాజిక వర్గానికి చెందిన సరితను రాష్ట్ర కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమిస్తారనే టాక్ వినిపిస్తోంది.
Similar News
News November 23, 2024
కొల్లాపూర్: ఈనెల 27న హీరో విజయ్ రాక..
ఈనెల 27, 28, 29న కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆర్ఐడీ పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 27న ప్రారంభమయ్యే స్వర్ణోత్సవాలను సినిమా హీరో విజయ్ దేవరకొండ ప్రారంభించనున్నారు. అలాగే చివరి రోజు 29న కొల్లాపూర్ పట్టణంలోని రామాపురం రహదారిలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు ఆర్టిస్టులతో కొల్లాపూర్ బిజీబిజీగా కళకళలాడనుంది.
News November 23, 2024
MBNR:చలి పంజా.. వణుకుతున్న ప్రజలు
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా తెల్లవారు జాము నుంచే దట్టమైన పొగ మంచుతో చలి గాలుల తీవ్రత పెరుగుతున్నది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు భారీగా కురవడంతో చెరువులన్నీ నీటితో నిండాయి. ఫలితంగా చెరువుల మీదుగా చలి గాలులు ఎక్కువగా వీస్తున్నాయి. చలిగాలుల తీవ్రత పెరుగుతున్నందున వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని, స్వెటర్లు, చేతులకు గ్లౌజులు ధరిస్తే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
News November 23, 2024
ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం: బీసీ కమిషన్ ఛైర్మన్
MBNR జిల్లా కలెక్టరేట్లో బీసీ కమిషన్ ఇవాళ నిర్వహించిన బహిరంగ విచారణలో బీసీ సంఘాలు, మైనార్టీ వర్గాల నుంచి స్వీకరించిన వినతులను ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ గోపిశెట్టి నిరంజన్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన బీసీ సంఘాలు, వివిధ కుల సంఘాలు, వ్యక్తులు, సంస్థల నుంచి 135 వినతులు ఆఫిడవిట్ రిజిస్టర్ చేసుకున్నారని ఆయన తెలిపారు.