News March 18, 2024
సరిహద్దు చెక్ పోస్టులను తనిఖీ చేసిన శ్రీకాకుళం ఎస్పీ
జిల్లా సరిహద్దుగా ఉన్న కంచిలి మండలంలో గాటి ముకుందపురం, ఇచ్ఛాపురం మండలంలో పురుషోత్తపురం అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను సోమవారం రాత్రి జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక, అదనపు ఎస్పీ జి.ప్రేమ కాజల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల రాకపోకలు, తనిఖీలను కాసేపు పరిశీలించి, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున చెక్ పోస్టు సిబ్బంది ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News November 27, 2024
SKLM: పొందూరు సింహాచలంపై ACB సోదాలు
ఏసీబీ అధికారులకు మరో భారీ చేప చిక్కింది. VSKPలోని GVMC జోన్-2. జోనల్ కమిషనర్ పొందూరు సింహాచలంపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైంది. దీంతో శ్రీకాకుళం, ఎచ్చెర్ల మండలం కేశవరావుపేటలో సింహాచలం, బంధువులు ఇళ్లలో సోదాలు చేసింది. ఇంటి స్థలాలు, 4.60 హె. భూమి, లక్షల విలువ గల కారు, బంగారు ఆభరణాలతో పాటుగా బ్యాంక్ ఖాతాలో నగదు ACB గుర్తించింది. కేసు నమోదు చేసిన ACB దర్యాప్తు చేస్తోంది.
News November 27, 2024
మందస: బుడంబో గ్రామ సమీపంలో పులి కలకలం
మందస మండలం, సాబకోట పంచాయితీ, బుడంబో గ్రామ సమీపాన పులి సంచరిస్తున్నట్లు మంగళవారం కలకలం రేగింది. మంగళవారం మధ్యాహ్నం స్కూటీపై మందస వెళ్లి తిరిగి సాబకోట వెళ్తుండగా చిన్న బరంపురం నుంచి బుడంబో వెళ్లే తారు రోడ్డులో పులి రోడ్డు దాటుతుండగా చూసినట్లు మదన్మోహన్ బెహరా అనే వ్యక్తి సాబకోట సచివాలయానికి వెళ్లి సమాచారం అందజేశారు. సచివాలయ సిబ్బంది పులి సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు.
News November 27, 2024
రూ.25 కోట్లకు పైగా అవినీతి సొమ్ము దాచిన శ్రీకాకుళం జిల్లా అధికారి
విశాఖకు చెందిన సింహాచలం విశాఖపట్నం జోన్-2 మున్సిపల్ కమిషనర్‌గా పని చేస్తున్నారు. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తుల కలిగి ఉన్నారని అభియోగంపై ACB మంగళవారం కేశవరావుపేట, కింతలి, శ్రీకాకుళం టౌన్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ప్రస్తుతం గుర్తించిన ఆస్తుల రూ.25కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. బంగారు, భూములు గుర్తించారు. విశాఖ, శ్రీకాకుళంలో ACB బీనామిలు, కుటుంబ సభ్యుల ఇంట్లో దాడులు నిర్వహించారు.