News February 12, 2025

సరూర్ నగర్: రేపు కబడ్డీ జట్ల ఎంపిక

image

రంగారెడ్డి జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ పోటీలు రేపు సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్ తెలిపారు. రేపు మధ్యాహ్నం 3 గం.కు ఎంపిక ఉంటుందని, 16 ఏళ్లలోపు బాల బాలికలు ఆధార్ కార్డుతో ఎంపికకు హాజరు కావాలన్నారు. ఎంపికైన వారు వికారాబాద్ జిల్లాలో జరిగే 34వ సబ్ జూనియర్ అంతర్ జిల్లా పోటీల్లో ఆడుతారన్నారు.

Similar News

News February 12, 2025

రోజుకు 30 నిమిషాలు ఇలా చేస్తే..!

image

ప్రతిరోజూ 10వేల అడుగులు వేయడం వీలుకాని వారు కనీసం ఆపకుండా 30 నిమిషాలు నడిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. ‘అధిక బరువు, ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్, క్యాన్సర్, అకాల మరణం నుంచి తక్కువ ప్రమాదం ఉంటుంది’ అని తెలిపారు. అయితే, నెమ్మదిగా నడవొద్దని, కాలక్రమేణా వేగాన్ని పెంచాలని సూచిస్తున్నారు. ఇది శరీర జీవక్రియ, శ్వాసకోశ, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

News February 12, 2025

నిర్లక్ష్యం వహిస్తే సహించబోను: ప్రకాశం కలెక్టర్

image

బాలలకు ఆధార్ కార్డుల జారీ కోసం ప్రత్యేక శిబిరాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని కలెక్టర్ అన్సారియా స్పష్టం చేశారు. శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బందితో బుధవారం ఒంగోలులోని కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శిబిరాల తీరు, పురోగతిపై సమక్షించారు. పనితీరు పేలవంగా ఉన్న సిబ్బందికి షోకజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులకు తెలిపారు.

News February 12, 2025

కొద్దిరోజుల్లో బ్రాందీ, విస్కీ రేట్లూ పెరుగుతాయి: మాజీ మంత్రి

image

TG: తెలంగాణ, ఏపీని మద్యం మాఫియా నడిపిస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. రెండు రాష్ట్రాలు ఒప్పందంతో నడుస్తూ ఒకేసారి మద్యం ధరలు పెంచాయని అన్నారు. కొద్దిరోజుల్లో బ్రాందీ, విస్కీ రేట్లూ పెరుగుతాయని తెలిపారు. ధరలు ఎవరు పెంచుతున్నారో తమకు తెలుసని, త్వరలోనే అన్ని వివరాలు బయట పెడతామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.

error: Content is protected !!