News December 7, 2024

సరూర్‌నగర్ BJP సభ (అప్‌డేట్స్)

image

సరూర్‌నగర్‌ సభ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపామని BJP నేతలు పేర్కొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు JP నడ్డా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, BJP ఎమ్మెల్యేలు, హైదరాబాద్, రంగారెడ్డికి చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రజల పక్షాణ BJP నిరంతరం పోరాటం చేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు.

Similar News

News January 14, 2025

SUPER.. దేశంలోనే మొదటి పార్కింగ్ కాంప్లెక్స్ మన HYDలో..!  

image

HYD నాంపల్లి పరిధిలో నిర్మించిన ఆటోమేటిక్ పార్కింగ్ సిస్టం వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానుంది. దీంతో నాంపల్లి పరిధిలో రోడ్డుపై పార్కింగ్ సమస్యలు తగ్గనున్నాయి. ఈ పార్కింగ్‌ను 15 అంతస్తులు మేర, జర్మన్ టెక్నాలజీతో నిర్మించారు. దేశంలో ఇదే మొట్ట మొదటి పెద్ద ఆటోమేటిక్ పార్కింగ్ కాంప్లెక్స్ కానుంది.

News January 14, 2025

HYD: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో..

image

సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 9100153883 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.

News January 13, 2025

HYD: మిసెస్ ఇండియా తెలంగాణగా మిథాలీ అగర్వాల్

image

హైదరాబాద్ వేదికగా నిర్వహించిన మిసెస్ ఇండియా పోటీల్లో తెలంగాణకు చెందిన మిథాలీ అగర్వాల్.. మిసెస్ ఇండియా తెలంగాణగా నిలిచారు. అండర్ 40లో 3వ స్థానంలో నిలిచి ఆమె రన్నరప్లో నిలిచారు. మిసెస్ మమత త్రివేది నిర్వహించిన ఈ ఈవెంట్‌లో వివిధ వయసు కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. మిథాలీ అగర్వాల్ గతంలో ఐఐటీ హైదరాబాద్ PROగా విధులు నిర్వహించారు. ఆమె విజయంపై పలువురు అభినందనలు తెలిపారు.