News April 23, 2025

సర్కార్ బడిలో మెరిసిన ఆణిముత్యం

image

తాజాగా విడుదలైన టెన్త్ ఫలితాల్లో పల్నాడు జిల్లా విద్యార్థిని అద్భుతంగా రాణించారు. కారంపూడి మండలం ఒప్పిచర్ల జడ్పీ పాఠశాల విద్యార్థిని పావని చంద్రిక 600కు 598 మార్కులు సాధించారు. ప్రభుత్వ పాఠశాలలో చదవి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన విద్యార్థినిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ లలిత, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.

Similar News

News April 23, 2025

రేపు హనుమకొండ జిల్లాకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

image

హనుమకొండ జిల్లాకు రేపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రానున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పలు కార్యక్రమాల్లో కవిత పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఎల్కతుర్తిలో BRS రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఎమ్మెల్సీ కవిత పర్యటనకు సంబంధించి నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

News April 23, 2025

కామారెడ్డి ఇన్‌ఛార్జి డీఈవోగా అశోక్

image

కామరెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి విద్యాశాఖ అధికారిగా నిజామాబాద్ డీఈఓ అశోక్ బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి ఇన్‌ఛార్జి డీఈఓ అశోక్‌ను ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య కామారెడ్డి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పలు ఉపాధ్యాయ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ సెక్రటరీ బలరాం, లచ్చయ్య, పంపరి ప్రవీణ్ కుమార్, ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

News April 23, 2025

విద్యార్థులకు మల్కాజిగిరి DCP కీలక సూచన

image

పరీక్షల్లో తప్పితే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని మల్కాజిగిరి DCP పద్మజా రెడ్డి హితవు పలికారు. ‘చదువు ఒక్కటే జీవితం కాదు. ఒక భాగ మాత్రమే. లైఫ్‌లో గెలుపోటములు సహజం. పరీక్షల్లో ఫెయిల్, తక్కువ మార్కులు వచ్చాయని బాధపడకుండా మళ్లీ ప్రయత్నించండి. పిల్లల భవిష్యత్తు కోసమే తల్లితండ్రులు కష్టపడుతున్నారు. విద్యార్థులు పట్టుదలతో ముందుకువెళ్లాలి’ అని DCP పద్మజా రెడ్డి మోటివేట్ చేశారు.

error: Content is protected !!