News February 6, 2025
సర్పంచ్ ఎన్నికలు.. వికారాబాద్ జిల్లా పూర్తి వివరాలు
గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మన వికారాబాద్ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు 4, మున్సిపాలిటీలు 4 ఉన్నాయి. ఇదిలా ఉంటే ZPTC-20, MPP-20, MPTC-227, గ్రామ పంచాయతీలు-594, వార్డులు 5058 ఉన్నాయి. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండడంతో గ్రామాల్లో సందడి నెలకొంది.
Similar News
News February 6, 2025
కాకినాడ జిల్లా ప్రజలకు ముఖ్య సమాచారం
గుండెపోటు వస్తే రూ.45 వేల విలువైన ఇంజెక్షన్‌ను ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా వేస్తారని కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్ వెల్లడించారు. సంబంధిత వాల్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఇంజెక్షన్ దొరికే ఆసుపత్రుల వివరాలు ఇవే.
➤ తాళ్లరేవు ➤ సామర్లకోట ➤ తుని ➤ పెదపూడి
➤ ప్రత్తిపాడు ➤ ఏలేశ్వరం ➤ పెద్దాపురం
➤జగ్గంపేట ➤ పిఠాపురం ➤ రౌతులపూడి
News February 6, 2025
ఓర్వకల్లు దగ్గర ప్రమాదం.. ఇద్దరు మృతి
కర్నూలు జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓర్వకల్లు వద్ద ట్రాక్టర్, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మృతులు జానకి(60), విహారిక(4)గా గుర్తించారు. తిరుమల దర్శనం చేసుకుని తిరిగి రాయచూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 6, 2025
డిగ్రీ అర్హతతో రూ.1.10 లక్షల జీతంతో ఉద్యోగాలు
224 పోస్టుల భర్తీకి AAI (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం మార్చి 5లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. జనరల్ అభ్యర్థులు రూ.1,000 ఫీజు చెల్లించి అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. SC, STలకు వయసు సడలింపు ఉంటుంది. అభ్యర్థులు డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్) చదివి ఉండాలి. నెలకు రూ.31,000-రూ.1,10,000 జీతం ఉండనుంది. aai.aero