News June 14, 2024

సర్పంచ్ పదవికి గోండు శంకర్ రాజీనామా

image

శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టప్పపేట గ్రామపంచాయతీ సర్పంచ్ గోండు శంకర్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో శ్రీకాకుళం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన గోండు శంకర్.. వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావుపై గెలుపొందారు. దీంతో గోండు శంకర్ సర్పంచ్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని డీపీఓ వెంకటేశ్వరరావుకు అందజేశానని ఆయన తెలిపారు.

Similar News

News October 2, 2024

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి దసరా సెలవులు

image

శ్రీకాకుళం జిల్లాలోని అన్ని పాఠశాలలకు అక్టోబర్ 2 (బుధవారం) నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డా. తిరుమల చైతన్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ దసరా సెలవుల్లో… బీచ్ లకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు. అలాగే వారికి బైకు ఇవ్వరాదని దానివల్ల ప్రమాదాలు ఉంటాయని సూచించారు.

News October 2, 2024

ఆమదాలవలస: మహాత్మా గాంధీ నాటిన మొక్క నేడు మహా వృక్షం

image

క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఉద్యమకారుల్లో స్ఫూర్తి నింపేందుకు మహాత్మా గాంధీ ఆమదాలవలస మండలం దూసి రైల్వే స్టేషన్‌కు 1942లో చేరుకున్నారు. అక్కడ రైల్వే స్టేషన్‌లో దిగి సమరయోధులతో స్వాతంత్ర్య కాంక్షపై మాట్లాడారు. అనంతరం ఒక మర్రి మొక్కను నాటారు. నేడు అది మహావృక్షంగా మారింది. ఈ వృక్షానికి 82 ఏళ్లు వయసైందని దూసి గ్రామస్థులు చెబుతున్నారు.

News October 2, 2024

స్వర్ణాంధ్ర విజన్‌లో భాగస్వామ్యం కావాలి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర విజన్ రూపకల్పనలో ప్రజలందరూ భాగస్వాములై తమ అభిప్రాయాలను తెలపాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కోరారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ ప్రణాళికను రూపొందించడంలో రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లా తొలిస్థానంలో నిలిచిందన్నారు. ఇంకా సమయం ఉన్నందున స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు అవసరమైన సలహాలు సూచనలు అందించాలని అన్ని వర్గాలను కోరుతున్నట్లు చెప్పారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో మాట్లాడారు.