News April 11, 2025

సాగర్ కాల్వలకు నీటి నిలిపివేత

image

గతేడాది డిసెంబర్ 15 నుంచి అధికారులు సాగర్ కుడి, ఎడమ కాలువలకు ఏకధాటిగా నీటి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గురువారం సాయంత్రం నీటి విడుదలను నిలిపివేశారు. ఎడమ కాల్వ కింద ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల వరకు సాగవగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలు సాగైంది. ఈ సీజన్ లో ఎడమ కాల్వకు 74 టీఎంసీల వాటర్ రిలీజ్ చేయగా, కుడి కాల్వకు 100 టీఎంసీలు విడుదల చేశారు.

Similar News

News April 19, 2025

ఖమ్మంలో 10 ఆసుపత్రులు సీజ్ : DMHO

image

CMRF బిల్లుల జారీలో అవకతవకలకు పాల్పడిన ఖమ్మంలోని 10 ఆసుపత్రులను మూసివేసినట్లు DMHO డా.కళావతి బాయి తెలిపారు. శ్రీ వినాయక, శ్రీకర మల్టీ స్పెషాలిటీ, సాయిమల్టీ స్పెషాలిటీ, వైష్ణవి, సుజాత, ఆరెంజ్, న్యూ అమృత, మేఘ, JR ప్రసాద్, గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లను రద్దుచేసి మూసివేసినట్లు చెప్పారు. చికిత్సలు చేయకుండానే నకిలీ బిల్లును సృష్టించి CMRF నిధులను కాజేశారని పేర్కొన్నారు.

News April 19, 2025

జేఈఈ మైన్స్ ఫలితాల్లో హార్వెస్ట్ ప్రభంజనం

image

JEE మెయిన్స్ ఫలితాల్లో ఖమ్మం హార్వెస్ట్ కళాశాల ప్రభంజనం సృష్టించింది. జాతీయ స్థాయిలో 17వ ర్యాంకు సాధించడమే కాకుండా జిల్లా ప్రథమ, తృతీయ స్థానాలు సాధించింది. హార్వెస్ట్ కళాశాల నుంచి 40% విద్యార్థులు అడ్వాన్స్ పరీక్షకు ఉత్తీర్ణత సాధించడం మరో విశేషం. అటు ఈ కళాశాల విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో సీటు పొందారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను యాజమాన్యం అభినందించింది.

News April 19, 2025

కూసుమంచి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

image

కూసుమంచిలోని హైస్కూల్ ఎదురుగా రెండు రోజుల క్రితం రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన పోచారం గ్రామానికి చెందిన ఇందుర్తి శ్రీనివాసరెడ్డి చనిపోయారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

error: Content is protected !!