News May 11, 2024

‘సాగర్’లో భారీగా తగ్గిపోతున్న జలాలు

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి నిల్వలు రోజురోజుకు భారీగా తగ్గుతున్నాయి. శనివారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, 504.80 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను, 123.0122 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో లేదని, అవుట్ ఫ్లో 400 క్యూసెక్కులు కొనసాగుతోందని తెలిపారు.

Similar News

News September 29, 2024

చెన్నారం గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

image

కొండమల్లేపల్లి మండలం చెన్నారం గ్రామపంచాయతీ శివారులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బుగ్గ తండాకు చెందిన భీముడు (23), రమేష్(8)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 29, 2024

NLG: ఎటు చూసినా ధరల మోతే

image

నల్గొండ జిల్లాలో కూరగాయల ధరలు ముండిపోతున్నాయి. రైతు బజార్లు, వారపు సంత, కూరగాయల మార్కెట్ ఎక్కడ చూసినా ధరల మోత మోగుతుంది. ఏ కూరగాయ చూసినా పావు కేజీ రూ.40 నుంచి రూ.60 పలుకుతోంది. జిల్లాలో రైతులు కూరగాయల సాగు వైపు పెద్దగా దృష్టి సారించడం లేదు. దీంతో కూరగాయలను ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు. పెరిగిన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

News September 29, 2024

NLG: నల్గొండకు కావాలి హైడ్రా!

image

నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసినా అక్రమార్కుల్లో భయం కనిపించడం లేదు. నల్గొండ పట్టణంతో పాటు పరిసర మండలాల్లో పెద్ద ఎత్తున చెరువులు, కుంటలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి ప్రభుత్వ స్థలాల్లో ఫ్లాట్లు ఏర్పాటుచేసి విక్రయించినట్లు తెలుస్తోంది. అధికారులు వీటిపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.