News March 21, 2025

సామర్లకోట: రైలు నుంచి జారిపడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి

image

ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి ప్రమాదవశాత్తూ కిందికి జారిపడడంతో తలకు బలమైన గాయమై ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ మహిళా ఉద్యోగి మృతి చెందింది. ఈ ఘటన సామర్లకోట రైల్వే పోలీస్టేషన్ పరిధిలో జి.మేడపాడు స్టేషన్ వద్ద గురువారం జరిగింది. ప్రమాద సమయంలో కొన ఊపిరితో ఉన్న యువతిని రైల్వే ఉద్యోగులు గుర్తించి చికిత్స నిమిత్తం సామర్లకోట తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు.

Similar News

News December 13, 2025

KNR: పంచాయతీ పోరుకు పటిష్ట భద్రత: సీపీ

image

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రేపు జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. మానకొండూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని 113 పంచాయతీల కోసం 1046 పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలు మోహరిస్తున్నట్లు చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణకు నిషేధాజ్ఞలు విధించారు. విజయోత్సవ ర్యాలీలు నిషేధమని స్పష్టం చేశారు.

News December 13, 2025

నూతన సర్పంచులను సన్మానించిన బండి సంజయ్

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులను కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సన్మానించారు. వేములవాడ బీజేపీ ఇన్‌ఛార్జ్ చెన్నమనేని వికాస్ రావు నేతృత్వంలో వారిని సన్మానించి అభినందించారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌లు కీలకపాత్ర పోషిస్తారని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సమర్థవంతమైన పాలన అందించాలని వారు సూచించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు గోపి పాల్గొన్నారు.

News December 13, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహుడి ఖజానాకు రూ. 4.27 లక్షలు

image

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి శనివారం భక్తుల నుంచి భారీగా ఆదాయం సమకూరింది. టికెట్ల విక్రయాలు, ప్రసాదాల విక్రయాలు, అన్నదానం సేవ ద్వారా ఆలయానికి మొత్తం రూ. 4,27,073/- ఆదాయం నమోదైంది. ఇందులో టికెట్ల ద్వారా రూ. 2,30,514/-, ప్రసాదాల ద్వారా రూ. 1,52,140, అన్నదానం సేవ ద్వారా రూ.44,419/- ఆదాయం వచ్చింది. భక్తుల సహకారంతోనే ఆలయ సేవలు నిరంతరం కొనసాగుతున్నాయని ఆలయ అధికారులు తెలిపారు.