News August 7, 2024
సార్వత్రిక ‘పది’, ఇంటర్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ను ఉమ్మడి జిల్లా సమన్వయ అధికారి శంకర్రావు విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని పేర్కొన్నారు. ప్రవేశ రుసుం వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలని చెప్పారు. పూర్తి వివరాలకు 8008403631, 9396337572 నంబర్లను సంప్రదించాలన్నారు.
Similar News
News November 27, 2024
భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలి: కలెక్టర్
భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం భద్రకాళి చెరువులో చేపట్టిన పూడికతీత పనులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేలు పరిశీలించారు.
News November 27, 2024
విజయోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి: ములుగు కలెక్టర్
ప్రజా పాలన, విజయోత్సవాల కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ములుగు కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజాపాలన, విజయయోత్సవ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందన్నారు. ఈనెల 29న స్థానిక డిఎల్ఆర్ గార్డెన్లో విజయోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు.
News November 27, 2024
వరంగల్: పెరిగిన పత్తి ధర
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర పెరిగింది. సోమవారం క్వింటా కొత్త పత్తి ధర రూ.6,860 పలకగా. మంగళవారం రూ.6,770కి పడిపోయింది. బుధవారం రూ.70 పెరిగి రూ. 6,840 అయింది. మార్కెట్లో ధరలు పెరుగుతూ తగ్గుతుండడంతో రైతన్నలు అయోమయానికి గురవుతున్నారు. ధరలు పెరిగేలా చూడాలని కోరుతున్నారు.