News March 29, 2025

సాలూరు: అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

image

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన సంఘటన సాలూరు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. సాలూరు రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కందులపథం పంచాయతీ చిన్నవలస గ్రామానికి చెందిన ఐశ్వర్య(20) చీపురువలస సమీపంలోని జీడి తోటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. ఓ యువకుడిపై అనుమానంతో అతని కోసం గాలిస్తున్నారు.

Similar News

News April 2, 2025

బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి.. రాష్ట్రంలో తొలి కేసు

image

AP: పచ్చిమాంసం తిన్న 2ఏళ్ల బాలిక బర్డ్ ఫ్లూతో చనిపోయిన ఘటన పల్నాడు (D) నరసరావుపేటలో జరిగింది. రాష్ట్రంలో ఈ వైరస్‌తో మనుషులు మరణించడం ఇదే తొలిసారి. అనారోగ్యంతో ఉన్న బాలికను మార్చి 4న మంగళగిరి ఎయిమ్స్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ 16న మృతిచెందింది. పాప స్వాబ్ నమూనాలను పరీక్షించగా బర్డ్ ఫ్లూగా తేలింది. కోడిని కోసేటప్పుడు అడగ్గా ఓ ముక్క ఇచ్చామని, అది తిన్న చిన్నారి జబ్బు పడిందని పేరెంట్స్ చెప్పారు.

News April 2, 2025

బర్డ్ ఫ్లూ అలర్ట్.. ఉడికించిన మాంసమే తినాలి!

image

AP: నరసరావుపేట బాలిక బర్డ్ ఫ్లూతో చనిపోయిన ఘటన కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పచ్చిమాంసానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పచ్చిమాంసంలోని సాల్మొనెల్లా, కాంపిలోబ్యాక్టర్, ఇ.కోలి బ్యాక్టీరియా చాలా డేంజర్. అందుకే చికెన్‌తో పాటు గుడ్లను 100 డిగ్రీలకు పైగా ఉడికించి తినాలి. జబ్బుపడిన పెంపుడు జంతువులు, పక్షులకు దూరంగా ఉండాలి. జ్వరం, జలుబు, దగ్గు తీవ్రస్థాయిలో ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

News April 2, 2025

వెంకటాపూర్: పాఠశాల ఆవరణలో క్షుద్రపూజలు

image

పాఠశాల ఆవరణలో క్షుద్రపూజలు చేసిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాలు.. వెంకటాపూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టి ముగ్గుపోసి క్షుద్రపూజలు చేసినట్లు తెలిపారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పూజలపై స్థానికులు ఆరా తీస్తున్నారు.

error: Content is protected !!