News April 5, 2024
సాలూరు వీఆర్వో శ్రీరాములు మృతి

సాలూరు వీఆర్వో గోర్జ శ్రీరాములు(57) హార్ట్‌ఎటాక్‌తో మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. పెదబోరబంద గ్రామానికి చెందిన శ్రీరాములు సాలూరు పట్టణంలో వీఆర్వోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఆఫీసులోనే గుండె నొప్పి వచ్చింది. స్పందించిన తోటి సిబ్బంది హుటాహుటిన విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Similar News
News April 3, 2025
కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక తండ్రి ఆత్మహత్య: SI

రామభద్రపురం మండలం జన్నివలస గ్రామానికి చెందిన పతివాడ కొత్తయ్య (65) తన కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ ప్రసాద్ వివరాల మేరకు.. కొత్తయ్య కుమారుడు కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
News April 3, 2025
VZM: రైలు నుంచి జారిపడి కానిస్టేబుల్ మృతి

ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడిన కానిస్టేబుల్ బొబ్బిలి రామకోటి(37) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. జామి మండలానికి చెందిన రామకోటి ప్రస్తుతం కొత్తవలస పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 1వ తేదీన రామకోటి విశాఖ నుంచి విజయనగరం వస్తున్న సమయంలో కోరుకొండ- విజయనగరం రైల్వే స్టేషన్ మధ్య జొన్నవలస సమీపంలో ప్రమాదవశాత్తు జారి పడటంతో మహారాజు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పోందుతూ మరణించాడు.
News April 3, 2025
రామభద్రపురం: పొక్సో కేసులో నిందితుడికి మూడేళ్లు జైలుశిక్ష

పొక్సో కేసులో నిందితుడు కె.రమేశ్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు మూర్తి కె.నాగమణి తీర్పు ఇచ్చినట్లు బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు చెప్పారు. ఆరికతోట గ్రామానికి చెందిన రమేశ్ అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై లైంగిక వేదింపులకు పాలప్పడినట్టు రామభద్రపురం పోలీస్ స్టేషన్లో 2021లో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో మూడేళ్లు జైలుశిక్ష, రూ.11వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు చెప్పారు.