News January 25, 2025
సాలూరు: వేగవతి బ్రిడ్జి కింద యువకుడి మృతదేహం

సాలూరులోని వేగావతి బ్రిడ్జి కింద యువకుడి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. మృతుడు గాంధీ నగర్‌కు చెందిన తుపాకుల శివశంకర్‌గా పోలీసులు గుర్తించారు. వేగావతి నది ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లిన శివ అనుమానాస్పద రీతిలో చనిపోయి ఉండడంతో అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాగిన మైకంలో నీటిలో మునిగిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 14, 2025
పాలకొల్లులో డయాలసిస్ సెంటర్ ప్రారంభం

రాష్ట్రంలో రెండు డయాలసిస్ కేంద్రాలు మాత్రమే మంజూరు కాగా, అందులో ఒకటి, పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం పాలకొల్లులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్‌ను రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి అనగాని సత్య కుమార్ యాదవ్, జలవనరుల శాఖ మంత్రి ప్రారంభించారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.
News March 14, 2025
CM గారికి ఇంత అసహనం పనికిరాదు: కవిత

TG: BRS MLA జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని MLC కవిత డిమాండ్ చేశారు. ‘ఓర్పు లేని వాళ్లు మార్పు ఎలా తెస్తారు? జగదీశ్ రెడ్డి గారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నా. ప్రజా సమస్యలపై గొంతెత్తుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే సభ నుంచి బహిష్కరిస్తారా? కాంగ్రెస్ ప్రభుత్వానికి, CM గారికి ఇంత అసహనం పనికిరాదు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ఉండేందుకే సస్పెండ్ చేశారు’ అని ఆరోపించారు.
News March 14, 2025
హోలీ సంబరాల్లో సంగారెడ్డి ఎస్పీ

సంగారెడ్డిలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ పరితోష్ పంకజ్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు శుక్రవారం నిర్వహించారు. కార్యాలయ ఉద్యోగులు, పోలీసులు ఎస్పీ రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. సహజమైన రంగులతోనే పండగ జరుపుకోవాలని చెప్పారు. చెరువులు, కుంటల వద్దకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.