News November 10, 2024

సింగపూర్‌లో భరతనాట్యం.. అభినందించిన సింగపూర్ ప్రధాని

image

చేగుంట మండలం రుక్మాపూర్‌కు చెందిన బసిక ప్రశాంత్ రెడ్డి, అనితారెడ్డి దంపతుల కూతుర్లు అనీశ, ప్రనీశ భరతనాట్యంలో ప్రతిభ కనపరుస్తున్నారు. దీపావళి పురస్కరించుకొని శనివారం సింగపూర్ కమ్యూనిటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన దీపావళి ఉత్సవాల్లో చిన్నకూతురు భరతనాట్యం చేసి అందరిని అబ్బరుపరిచారు. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ భారతీయుల సంస్కృతిక ప్రదర్శనలను అభినందించారు.

Similar News

News November 13, 2024

సిద్దిపేట: ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలి

image

వరిధాన్యం కొనుగోలు రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. హైదరాబాద్ సచివాలయం నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లతో ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం, పత్తి కొనుగోళ్లు సాఫీగా సాగేలా చూడాలని, సామాజిక, ఆర్థిక, కుల గణనను పూర్తి చేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనూచౌదరి, అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ పాల్గొన్నారు.

News November 13, 2024

మెదక్: భార్య డెలివరీ.. యాక్సిడెంట్‌లో భర్త మృతి

image

మనోహరాబాద్ మండలం దండుపల్లి వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కూచారం గ్రామానికి చెందిన మజ్జతి విజయ్(30) మృతి చెందాడు. సోమవారం అతడి భార్య మౌనిక తూప్రాన్ ఆసుపత్రిలో ప్రసవమైంది. గ్రామానికి చెందిన బోయిని ప్రేమ్ చంద్‌తో కలిసి బైక్ పై వెళ్లి బిడ్డను తిరిగి వస్తుండగా డీసీఎం ఢీకొని విజయ్ మృతి చెందాడు. భార్య డెలివరీ అయి ఆసుపత్రిలో ఉండగా.. అదే ఆసుపత్రి మార్చురీకి భర్త మృతదేహం వెళ్లడం విషాదకరం.

News November 13, 2024

కాళోజీ సేవలను స్మరించుకున్న కేసీఆర్

image

ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్మరించుకున్నారు. మహోన్నతమైన తెలంగాణ అస్తిత్వాన్ని, సాహిత్య సాంస్కృతిక గరిమన ప్రపంచానికి చాటిన గొప్ప కవి అని, కవిగా తన కలాన్ని, గళాన్ని, జీవితాన్ని తెలంగాణ కోసం అర్పించిన కాళోజీ కృషి చిరస్మరణీయమని కొనియాడారు.