News April 13, 2025
సింహాచలం: చందనోత్సవానికి 51 ప్రత్యేక బస్సులు

సింహాచలంలో ఏప్రిల్ 30న జరిగే చందనోత్సవానికి కొండ మీదకు 51 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు శనివారం తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండమీదకు వెళ్లే బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. గోశాల, శ్రీనివాస్ నగర్, అడివివరం నుంచి ఈ బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. ఆరోజున భక్తుల వాహనాలు కొండమీదకు అనుమతి లేదని ఈ బస్సులు వినియోగించుకోవాలన్నారు.
Similar News
News April 15, 2025
పంజాబ్‌కు ‘మ్యాక్సీ’మమ్ నిరాశే

పంజాబ్ ప్లేయర్ మ్యాక్స్‌వెల్ మరోసారి నిరాశపరిచారు. KKRతో మ్యాచులో కీలక వికెట్లు కోల్పోయిన పంజాబ్‌ను ముందుండి నడిపించాల్సింది పోయి వరుణ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యారు. గత మ్యాచుల్లోనూ మ్యాక్సీ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. మొత్తంగా ఈ సీజన్లో 6 మ్యాచుల్లో 41 పరుగులే చేశారు. దీంతో జట్టుకు భారంగా మారారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
News April 15, 2025
సుందరీమణులు పాల్గొనే కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు మే 14వ తేదీన వరంగల్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని HNK కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించారు. వరంగల్ పర్యటనలో భాగంగా సుందరీమణులు కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శించనున్నారని, తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
News April 15, 2025
ఉమ్మడి కర్నూల్ జిల్లాలో 240 పోస్టులు.!

రాష్ట్రంలోని 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ప్రభుత్వం సృష్టించింది. ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూల్ జిల్లాలో 240 పోస్టులు. వీటిలో 110 ఎస్‌జీటీ, 69 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఉమ్మడి కర్నూల్ జిల్లాలో 199 స్కూల్ అసిస్టెంట్ టీచర్లు అవసరం కాగా గతంలోనే 69 పోస్టులు మంజూరు చేసింది. తాజాగా 130 పోస్టులను కేటాయిస్తూ డీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేస్తామని ప్రకటించింది.