News April 13, 2025
సింహాచలం: చందనోత్సవానికి 51 ప్రత్యేక బస్సులు

సింహాచలంలో ఏప్రిల్ 30న జరిగే చందనోత్సవానికి కొండ మీదకు 51 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు శనివారం తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండమీదకు వెళ్లే బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. గోశాల, శ్రీనివాస్ నగర్, అడివివరం నుంచి ఈ బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. ఆరోజున భక్తుల వాహనాలకు కొండమీదకు అనుమతి లేదని, ఈ బస్సులు వినియోగించుకోవాలన్నారు.
Similar News
News April 16, 2025
శ్రీశైలంలో అమ్మవారికి వైభవంగా కుంభోత్సవం

AP: శ్రీశైల భ్రమరాంబ అమ్మవారి కుంభోత్సవం వైభవంగా జరిగింది. ఏటా ఛైత్ర మాసంలో సాత్విక బలి పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆలయంలో 5వేల గుమ్మడి కాయలు, 5వేల టెంకాయలు, లక్షకు పైగా నిమ్మకాయలతో ఆలయ అధికారులు ఘనంగా వేడుక జరిపారు. ఈ సందర్భంగా భక్తులకు అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం కలిగింది. అంతకముందు అన్నం, పెసరపప్పు రాశులుగా పోసి ప్రదోషకాల పూజలు నిర్వహించారు.
News April 16, 2025
వనపర్తి: భూభారతిపై షెడ్యూల్ విడుదల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ నెల 17వ తారీకు నుంచి 26 వరకు మండల కేంద్రాల్లో ప్రజలకు అవగాహన కల్పించడానికి జిల్లా యంత్రాంగం షెడ్యూల్ విడుదల చేసింది. రైతులు తమ భూములను రిజిస్ట్రేషన్, ఆర్ఓఆర్ సవరణలు, అడంగల్ తప్పొప్పుల సవరణ, నాలా తదితర వాటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
News April 16, 2025
కొత్తగూడెం: యువతి చదువుకు బాబుమోహన్ భరోసా

కొత్తగూడెం(D) అశ్వారావుపేటకు చెందిన యువతి చదువుకు ప్రముఖ నటుడు బాబు మోహన్ భరోసానిస్తూ ముందుకు వచ్చారు. మండలంలోని బండారిగుంపునకు చెందిన బైట గోపాలరావు రెండో కుమార్తె సమీప బీటెక్ పూర్తి చేసింది. ఎంటెక్ చదవడానికి బాబుమోహన్ ముందుకు వచ్చి తన కుమారుడి ట్రస్ట్ పేరు మీద చదువు పూర్తి చేయిస్తానని హామీనిచ్చారు. చదువు పూర్తిచేసి ఫారెస్ట్ రేంజ్ అధికారిణి అవుతానని సమీప ఆయనకు తెలిపింది.