News December 5, 2024
సింహాచలంలో ఆధ్యాత్మిక మ్యూజియం
సింహాచలం పుణ్యక్షేత్రంపై ఆధ్యాత్మిక మ్యూజియం నిర్మించాలని సంకల్పించామని బ్రహ్మకుమారీస్ వికే రమాదేవి తెలిపారు. ఈ మేరకు ఆమె డాబాగార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్ క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మ్యూజియంను సనాతన ధర్మాన్ని ప్రతిబింబించే విధంగా దేవతల విగ్రహాలతో పాటు, సామాజిక, నైతిక విలువలు తెలియజేసే విధంగా నిర్మిస్తామని అన్నారు.
Similar News
News January 6, 2025
గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు..!
వైజాగ్ నుంచి సికింద్రాబాద్‌కు ఆదివారం బయలుదేరిన గోదావరి ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో పొగతో పాటు కాలిన వాసన రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి 1గంట సమయంలో ఖమ్మం సమీపంలోకి ట్రైన్ చేరుకునే సరికి B1 కోచ్‌లో ఫైర్ అలారం మోగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రైలును సుమారు 45min నిలిపి సమస్య పరిష్కరించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
News January 6, 2025
విశాఖ: ‘8న జరగాల్సిన పరీక్ష 11కు వాయిదా’
కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా కైలాసగిరి రిజర్వు పోలీస్ మైదానంలో జరుగుతున్న దేహదారుఢ్య పరీక్షల్లో అధికారులు స్వల్ప మార్పు చేశారు. ఈ నెల 8న జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలను 11వ తేదీకి వాయిదా వేసినట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఛైర్మన్ ఎం.రవి ప్రకాశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు పీఈటీ పరీక్షలు జరిగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అభ్యర్థులు గమనించాలని కోరారు.
News January 5, 2025
బీచ్ హ్యాండ్ బాల్ విజేతగా విశాఖ జట్టు
అచ్యుతాపురం మండలం పూడిమడకలో రెండు రోజుల పాటు నిర్వహించిన బీచ్ హ్యాండ్‌బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో విజేతగా విశాఖ జట్టు నిలిచింది. రన్నర్‌గా కర్నూలు జట్టు, మూడవ స్థానంలో ప్రకాశం జట్టు నిలిచాయి. విజేతలకు బహుమతులను జనసేన ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల కోఆర్డినేటర్ సుందరపు సతీశ్ కుమార్ అందజేశారు. ఈ పోటీలు విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.