News July 10, 2024

సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణ రూట్ మ్యాప్ ఇదే

image

ఈనెల 20న జరిగే సింహాద్రి అప్పన్న గిరి ప్రదర్శనకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 32 కిలోమీటర్ల మేర జరిగే ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. సింహాచలం, అడివివరం, బి.ఆర్.టీ.ఎస్ రహదారి మీదుగా, ముడసర్లోవ, హనుమంతువాక, వెంకోజిపాలెం, సీతమ్మధార, మాధవధార, ఎన్.ఎ.డి కూడలి నుంచి గోపాలపట్నం మీదుగా సింహాచలం వరకు భక్తులు కాలి నడకన చేరుకుంటారు. > Share it

Similar News

News November 26, 2024

విజయనగరంలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

విజయనగరం ఏపీఎస్పీ బెటాలియన్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. పోలీసులు వివరాల ప్రకారం.. భోగాపురం మండలం గూడెపువలసకి చెందిన రమేశ్ (25) విజయనగరం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ముందున్న బొలేరోని ఢీకొన్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమేశ్‌ని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీనిపై డెంకాడ ఎస్.ఐ ఏ. సన్యాసినాయుడు కేసు నమోదు చేశారు.

News November 26, 2024

IPL వేలంలో విజయనగరం కుర్రాడికి చుక్కెదురు

image

ఐపీఎల్ మెగా వేలంలో విజయనగరం జిల్లా గరివిడికి చెందిన బైలపూడి యశ్వంత్ రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో తన పేరును రిజిస్టర్ చేసుకున్నారు. ఈయన రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్‌గా క్రికెట్‌లో రాణిస్తున్నాడు. అయితే వేలంలో అతనికి చుక్కెదురయ్యింది. ఏ ఫ్రాంఛైజీ తనను తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. దీంతో విజయనగరం వాసులు, అభిమానులు నిరాశ చెందారు.

News November 26, 2024

గత ఐదేళ్లు జీసీసీ పూర్తిగా నిర్వీర్యం:కిడారి

image

గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం జీసిసిని పూర్తిగా నిర్వీర్యం చేసిందని దీని బలోపేతానికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని ఆ సంస్థ రాష్ట్ర ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. విజయనగరంలో సబ్బుల తయారీ యూనిట్‌ను ఆయన సోమవారం పరిశీలించారు. ప్రైవేటు సరుకులు మాదిరిగా డిసిసి సరుకులు జనాలను ఆకర్షించే విధంగా నాణ్యతతో తయారు చేస్తామని చెప్పారు.