News June 8, 2024

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మత్తు పదార్థాల కలకలం

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోకి కొందరు పేషంట్ సహాయకులు కల్లు, గుట్కా ప్యాకెట్లు లాంటి మత్తు పదార్థాలను తీసుకురావడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది గాంధీ సందర్శకులను తనిఖీలు చేస్తూ నిషేధిత మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్నారు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. ఆసుపత్రిలోకి మత్తు పదార్థాలను తీసుకురావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Similar News

News November 29, 2024

HYD: సైకో.. యువతిని చంపేసి అత్యాచారం!

image

సైకో కిల్లర్‌ రాహుల్ కేసులో‌ భయంకర నిజాలు వెలుగుచూశాయి. ఈ నెల 14న ఓ యువతిని హత్యాచారం చేసిన కేసులో వల్సాద్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. హత్య చేసి అదే మృతదేహాం పక్కన నిద్రించే అలావాటు రాహుల్‌కు ఉందని గుర్తించారు. సదరు యువతి(19)ని తోటలో చంపిన తర్వాత రెండోసారి అత్యాచారం చేశాడన్నారు. అయితే, <<14729624>>సికింద్రాబాద్-మణుగూరు<<>> రైలులో రమణమ్మను చంపిన ఈ నరహంతకుడిని HYD తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

News November 29, 2024

HYD: అప్పు చేసి పిల్లలకు వంట చేస్తున్నారు: CITU

image

మధ్యాహ్న భోజన పథకం కార్మికులు MEO ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. CITU జిల్లా ఉపాధ్యక్షుడు జగదీశ్ మాట్లాడారు. కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం, మెనూ ఛార్జీలు పెండింగులో ఉన్నాయన్నారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి వంట చేసి పెడుతూ.. కార్మికులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

News November 28, 2024

HYD: 26 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలి: ఆర్.కృష్ణయ్య

image

వచ్చే డీఎస్సీలో 26 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన నిరుద్యోగుల సభలో మాట్లాడుతూ.. విద్యాశాఖ అధికారులు టీచర్‌ పోస్టుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని ఆరోపించారు. ఏ పాఠశాలకు వెళ్లినా టీచర్ల కొరత ఉందన్నారు. ఎయిడెడ్‌ పాఠశాలలో 6 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నా వాటి భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వటం లేదన్నారు.