News January 23, 2025
సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాలు

SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. RRB గ్రూప్ D నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 32,438 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇందులో SCR పరిధిలో 1642 ఖాళీలు ఉన్నాయి. స్పెషల్ క్యాటగిరీలో మరో 710 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. వేతనం రూ. 18000 ఉంటుంది. వయస్సు: 18-36 మధ్య ఉండాలి. నేటి నుంచి ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అర్హత: 10th, ITI ఉత్తీర్ణత.
SHARE IT
Similar News
News March 12, 2025
తూ.గో. జిల్లాకు ప్రత్యేక అధికారి

ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్యతలను సీనియర్ IAS అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం సీనియర్ ఐఏఎస్ అధికారిగా ప్రవీణ్ కుమార్‌ను తూ.గో.జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ప్రభుత్వం కేటాయించింది. జోనల్ ఇన్‌ఛార్జ్‌గా అజయ్ జైన్‌ను నియమించింది. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
News March 12, 2025
వచ్చే నెల అమరావతికి ప్రధాని మోదీ!

AP: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో రాజధాని అమరావతి పనులను పున:ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించగా ఆయన అంగీకరించినట్లు సమాచారం. త్వరలో ప్రధాని కార్యాలయం అమరావతి పర్యటన తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, రాజధాని పనులను అట్టహాసంగా మళ్లీ స్టార్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 9ఏళ్ల కిందట అమరావతి పనులకు మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
News March 12, 2025
సంగారెడ్డి: 33 ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ

సంగారెడ్డి జిల్లాలోని ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న 33 ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ప్రాథమిక పాఠశాలలో చదివే 3 నుంచి 5 తరగతుల విద్యార్థులకు కంప్యూటర్‌పై అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.