News April 13, 2025
సిద్దిపేట: RYVకి అప్లై చేశారా.. 14 వరకే ఛాన్స్

యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాసం పథకం’ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. శనివారం వరకు జిల్లాలో 15 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రేపటి వరకు ఛాన్స్ ఉన్నందున ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు సూచించారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు.
Similar News
News December 23, 2025
పెద్దపల్లి: గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కన్వెన్షన్ పోస్టర్ ఆవిష్కరణ

పెద్దపల్లిలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్ పోస్టర్‌ను ఈ రోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ చాప్టర్ అధ్యక్షుడు వేల్పురి సంపత్ రావు మాట్లాడుతూ.. ఈ నెల 27, 28 తేదీలలో హైదరాబాదులోని గండిపేటలో గల అక్షయ కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం జరుగనుందని తెలిపారు. అసోసియేషన్ పెద్దపల్లి చాప్టర్ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
News December 23, 2025
ఏమాత్రం పట్టు తప్పినా ప్రాణాలు గాల్లోనే!

రోడ్డు భద్రత నియమాలు పాటించాలని పోలీసులు ఎంతగా మొత్తుకుంటున్నా వాహనదారులు, ప్రయాణికులలో మార్పు రావడం లేదు. ప్రాణాలు పోతాయని తెలిసినా ప్రమాదకర రీతిలో ప్రయాణాలు సాగిస్తూనే ఉన్నారు. సంగారెడ్డి-అకోలా జాతీయ రహదారి 161పై నిబంధనలకు విరుద్ధంగా తుఫాన్ వాహనంపై ఫుట్ బోర్డు మీద నిలబడి ఓ ప్రయాణికుడు అత్యంత ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న దృశ్యమిది. ఏమాత్రం పట్టు తప్పినా ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం.
News December 23, 2025
వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: సౌరబ్ గౌర్

ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సౌరబ్ గౌర్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్ వెట్రిసెల్వితో కలిసి ఏలూరు సర్వజన ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలు, మందుల లభ్యతపై ఆరా తీసి, విధుల్లో అలసత్వం వహించవద్దని సిబ్బందిని ఆదేశించారు.


