News January 31, 2025

సిద్దిపేట: అవార్డులు అందజేసిన సీపీ

image

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్కృష్ట, అతిఉత్కృష్ట సేవా పతకాలు పొందిన అధికారులను సిబ్బందిని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ అభినందించి, సేవా పథకాలు అందజేశారు. ఉత్కృష్ట సేవా పథక్ పొందిన వారిలో ఏఆర్ కానిస్టేబుళ్లు కే. శ్రీరామ్, కే.మల్లికార్జున్, మహిళా హోంగార్డు మమ్మద్ నసీమా, అతి ఉత్కృష్ట సేవా పథక్‌ను వెంకటరమణారెడ్డి, గోపాల్ రెడ్డి, ప్రభాకర్, నారాయణ, యాదయ్య, ప్రభు, జీవన్, అలెగ్జాండర్ పొందారు.

Similar News

News March 14, 2025

వైసీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా మల్లయ్య యాదవ్

image

వైసీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా మల్లయ్య యాదవ్ ఎంపికయ్యారు. గుత్తి మండలం బేతపల్లికి చెందిన వైసీపీ నేతలు సూర్యనారాయణ, ఈశ్వరయ్య, తదితరులు మల్లయ్య యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు. ముందుగా మల్లయ్యను శాలువాతో సత్కరించి, పూలమాల వేసి సన్మానించారు. రైతుల సమస్యల పట్ల పోరాడుతానన్నారు. తనను ఎంపిక చేసినందుకు వైఎస్ జగన్, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వైవీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

News March 14, 2025

ఎంటెక్ ఫలితాల విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన ఎంటెక్ 1వ, 2వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ (R21) పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ పీ.చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ కే.మాధవి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం కళాశాలలోని అకాడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.

News March 14, 2025

నిర్మల్: బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో ఉచిత శిక్షణ

image

జిల్లాలోని డిగ్రీ పాసైన బీసీ అభ్యర్థులకు హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ తెలిపారు. నెలరోజుల శిక్షణ అనంతరం ప్రైవేట్ బ్యాంకులలో ప్లేస్మెంట్ కల్పిస్తారని, డిగ్రీ పూర్తయి 26 సంవత్సరాల కన్న వయసు తక్కువగా ఉన్నవారు ఏప్రిల్ 8వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

error: Content is protected !!