News April 7, 2025
సిద్దిపేట: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

తాగిన మైకంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. ఎల్ బంజరుపల్లి గ్రామానికి చెందిన బొమ్మ రాజు (35) కుమ్మరి పని చేస్తూ కుటుంబంతో జీవిస్తున్నాడు. ఎప్పటిలాగే పనికి వెళ్లిన సరితా ఇంటికి తిరిగి వచ్చే వరకు రాజు ఇంట్లో ఉరి వేసుకున్నట్టు తెలిపింది. ప్రతి రోజు మద్యం సేవించి వచ్చేవాడని రాజు భార్య సరితా పోలీసులకు తెలిపింది.
Similar News
News April 17, 2025
సిజేరియన్ డెలివరీలపై చర్యలు తీసుకోవాలి: మంత్రి

కోఠిలోని TGMSIDC కార్యాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. సరైన కారణాలు లేకుండా సిజేరియన్ డెలివరీలు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ దవాఖాన్లలో నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలని, నర్సులకు మిడ్‌వైఫరీ శిక్షణ ఇవ్వాలని సూచించారు. వేసవిలో గర్భిణులు, బాలింతల కోసం ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.
News April 17, 2025
ఎల్లుండి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

AP: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు జులై నెల కోటా APR 19న ఉ.10 గం.కు విడుదల కానుంది. లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం ఎల్లుండి నుంచి 21వ తేదీ ఉ.10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకరణ సేవా టికెట్లు 22న ఉ.10 గంటలకు రిలీజ్ కానున్నాయి. జులై కోటా రూ.300 ప్రత్యేక ప్రవేశం దర్శనం టికెట్లు 24న ఉ.10 గంటలకు, మ.3 గంటలకు గదుల కోటా రిలీజ్ కానుంది.
News April 17, 2025
IPL: వారి సరసన రోహిత్ శర్మ

ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్‌లో ఒకే వేదికలో 100కు పైగా సిక్సర్లు బాదిన నాలుగో ఆటగాడిగా నిలిచారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా కోహ్లీ(130), గేల్(127), డివిలియర్స్(118) వందకు పైగా సిక్సర్లు బాదారు. వాంఖడేలో రోహిత్ 102 సిక్సర్లు కొట్టగా ఆ తర్వాతి స్థానంలో పొలార్డ్(85) ఉన్నారు.