News February 26, 2025

సిద్దిపేట: ఎమ్మెల్సీ ఎన్నికలు.. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది

image

మెదక్-కరీంనగర్-నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టబద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ఎలక్షన్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలోని పోలింగ్ స్టేషన్‌లా వారీగా సెక్టార్, ఫ్రీసెండింగ్, అదనపు ఫ్రీసెండింగ్ అధికారులకు అందజేసిన మెటీరియల్ పరిశీలించారు.

Similar News

News February 27, 2025

వరంగల్: బాలాజీనగర్లో గోమాతకు శ్రీమంతం

image

గోమాతకు శ్రీమంతం నిర్వహించిన ఘటన వరంగల్ నగరంలోని కాశీబుగ్గ ఎనుమాముల రోడ్డులోని బాలాజీ నగర్‌లో బుధవారం జరిగింది. శ్రీకైలాస ఈశ్వర ప్రభక్త ఆంజనేయస్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోమాతకు శ్రీమంతం పూజా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని గోశాలలో ఉన్న వకలా మాత గోవు గర్భం దాల్చగా ఆలయ భక్తులు ఈ కార్యక్రమం చేపట్టారు. స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

News February 27, 2025

స్టేషన్ ఘనపూర్: నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి

image

జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. చిల్పూర్ మండలం నష్కల్ గ్రామానికి చెందిన రాజు-అపర్ణలు తమ తకూరు తపస్వి(4)తో కలిసి అపర్ణ తల్లిగారి ఊరైన స్టే.ఘ.లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో చిన్నారి ఆడుకుంటూ వెళ్లి నీటితొట్టిలో పడింది. గమనించిన అపర్ణ వెంటనే తన కూతురిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News February 27, 2025

రికార్డు సృష్టించిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సీజన్

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సీజన్‌లో ఇప్పటివరకు 11 సెంచరీలు నమోదయ్యాయి. ఒక సీజన్‌లో అన్ని జట్లు కలిపి చేసిన అత్యధిక సెంచరీలు ఇవే. గతంలో 2002, 2017లో 10 శతకాలు నమోదయ్యాయి. ఈ రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. 2006లో 7, 2000, 2009లో 6, 1998, 2004లో 4, 2013లో 3 శతకాలు నమోదయ్యాయి. కాగా ఇవాళ జరిగిన ఇంగ్లండ్-అఫ్గానిస్థాన్ మ్యాచులో 2 సెంచరీలు వచ్చాయి. జో రూట్, ఇబ్రహీం జద్రాన్ శతకాలు బాదారు.

error: Content is protected !!