News February 25, 2025

సిద్దిపేట: ఏడుపాయల జాతరకు భారీగా బస్సులు

image

ఏడుపాయల జాతరకు భారీగా ఆర్టీసీ బస్సులను అధికారులు నడపనున్నారు. ఈ నెల 26 నుంచి 28 తేదీ వరకు మూడు రోజుల పాటు ఏడుపాయల జాతర కొనసాగనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, జేబీఎస్ నుంచి 300 బస్సులు, పటాన్‌చెరు, నారాయణఖేడ్, జహీరాబాద్ డిపోల నుంచి మరో 50 చొప్పున మొత్తం 400 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు నడపనున్నారు. రద్దీని బట్టి మరిన్ని బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Similar News

News February 25, 2025

దుద్యాల్: లగచర్ల రైతులు ఇండస్ట్రియల్ పార్కుకు సహకరిస్తున్నారు: కలెక్టర్

image

లగచర్ల రైతులు స్వచ్ఛందంగా ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి సహకరిస్తున్నారని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతీక్ జైన్ దుద్యాల మండలం లగచర్ల ఇండస్ట్రియల్‌కు సంబంధించి తమ భూమి స్వచ్ఛందంగా ఇచ్చిన 22 మంది రైతులకు చెక్కులు పంపిణి చేశారు. భూములు ఇస్తున్న రైతులకు నష్టపరిహారాలు అందించి ప్రభుత్వం తరఫున ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు.

News February 25, 2025

హిందూపురం మాజీ ఎమ్మెల్యే సతీమణి మృతి

image

హిందూపురం దివంగత మాజీ శాసనసభ్యుడు రంగనాయకులు సతీమణి ఈశ్వరమ్మ మంగళవారం ముదిరెడ్డిపల్లిలో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే వైసీపీ నాయకులు గుడ్డంపల్లి వేణురెడ్డి, కౌన్సిలర్లు మద్దన జయప్ప, మహేశ్ గౌడ్ ఈశ్వరమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగనాయకులకు సహధర్మచారిణిగా అన్ని పార్టీల నాయకులకు ఈశ్వరమ్మ సుపరిచితురాలని పేర్కొన్నారు. కాగా రంగనాయకులు 1985-85, 2004-9 మధ్య MLAగా ఉన్నారు.

News February 25, 2025

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి

image

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందిన విషాద ఘటన ఆత్మకూరు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రహీంఖాన్‌పేట్‌కు చెందిన గూడూరు చంద్రశేకర్, మత్సగిరి సోమవారం రాత్రి బంధువుల ఇంటి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా కీసర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అన్నదమ్ములు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో గ్రామంలో, వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

error: Content is protected !!