News April 12, 2024

సిద్దిపేట: కాంగ్రెస్ అభ్యర్థులను చీపుర్లతో కొట్టి తరిమేయండి: హరీష్ రావు

image

ఓట్ల కోసం గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ అభ్యర్థులను చీపుర్లతో కొట్టి తరిమేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. గురువారం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. నెలలు గడుస్తున్న ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోతుందని విమర్శించారు. ఆరూ గ్యారంటీలు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని ఎక్కడ అమలు చేశారో చూపించాలని ఆయన సవాల్ విసిరారు.

Similar News

News October 10, 2024

సిద్దిపేట: ఒకే ఇంట్లో నలుగురికి MBBS సీట్లు

image

సిద్దిపేటకు చెందిన రామచంద్రం, శారద దంపతుల నలుగురు కుమార్తెలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS‌ సీట్లు పొందారు. పెద్ద కుమార్తె మమత 2018లో MBBS‌లో చేరి డిగ్రీ పూర్తి చేసింది. రెండో కుమార్తె మాధవి 2020లో, ఈ ఏడాది మరో ఇద్దరు కుమార్తెలు రోహిణి, రోషిణి MBBS‌లో సీటు సాధించారని తండ్రి రామచంద్రం తెలిపారు. KCR జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతోనే ఇది సాధ్యమైందన్నారు. నేడు ఎమ్మెల్యే హరీశ్ రావును కలిశారు.

News October 10, 2024

సబ్జెక్ట్ టీచర్ లేని ఉన్నత పాఠశాలకు ప్రాధాన్యత నివ్వాలి: పీఆర్టీయూ

image

సబ్జెక్ట్ టీచర్ లేని ఉన్నత పాఠశాలల్లో మొదటి ప్రాధాన్యతగా భర్తీ చేయాలని మెదక్ డీఈవో రాధాకిషన్‌ను పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు సుంకరి కృష్ణ కోరారు. సింగిల్ స్కూళ్లలో బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేస్తూ ఆ పాఠశాలల్లో నూతన ఉపాధ్యాయులతో భర్తీ చేయాలన్నారు. విద్యార్థుల సంఖ్య కాకుండా సాంక్షన్ పోస్ట్ ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులను నింపాలని కోరారు. ఇందులో సంగమేశ్వర్, ఖదీర్, శ్రీనివాస్ ఉన్నారు.

News October 10, 2024

‘డీసీసీబీ ద్వారా రూ.2350 కోట్ల విలువైన సేవలు అందించాం’

image

ఉమ్మడి జిల్లాలో డీసీసీబీ బ్యాంకు ద్వారా రైతులకు ఇప్పటివరకు రూ.2,350 కోట్ల సేవలు అందించడం జరిగిందని ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి అన్నారు. డీసీసీబీ గజ్వేల్ శాఖ పూర్తి చేయడంతో బ్యాంకు మేనేజర్ రమేష్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. సంబరాల్లో పాల్గొని కేక్ కట్ చేసి మహిళా సంఘాలకు రుణాలు అందజేశారు. ఉమ్మడి జిల్లాలో డీసీసీబీ బ్యాంకు 400 కోట్ల టర్నోవర్ ఉండగా ప్రస్తుతం రూ.2,350 కోట్లకు చేరుకుందన్నారు.