News February 23, 2025

సిద్దిపేట: గ్రామం నుంచి జాతీయ స్థాయికి

image

బహుజన సమాజ్ పార్టీలో గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి కోఆర్డినేటర్‌గా ఎన్నికైన బెజ్జంకి మండల వాసి నిషాని రామ చంద్రంను శనివారం బెజ్జంకిలో మానకొండూర్ నియోజకవర్గ నాయకులు పలువురు ఘనంగా సన్మానించారు. బాధ్యతలను అప్పగించిన బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతికి ధన్యవాదాలు తెలిపారు. మాతంగి తిరుపతి, మల్లయ్య, నిషాని రాజమల్లు, సుమలత, గుర్రం సత్యనారాయణ, రాజు, కనకం రఘు పాల్గొన్నారు.

Similar News

News February 23, 2025

రేపు ఉ.10 గంటలకు..

image

AP: తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శన టికెట్లు రేపు (సోమవారం) విడుదల కానున్నాయి. మే నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లను రేపు ఉదయం 10 గం.కు రిలీజ్ చేయనున్నారు. తిరుమల, తిరుపతిలో వసతి కోటా టికెట్లు రేపు మ.3 గంటలకు విడుదల అవుతాయి. టికెట్లను దళారుల వద్ద కొనొద్దని https://ttdevasthanams.ap.gov.in/లోనే కొనుగోలు చేయాలని టీటీడీ సూచించింది.

News February 23, 2025

జనగామ: గురుకుల ప్రవేశ పరీక్షకు 51 మంది గైర్హాజరు

image

జనగామ జిల్లా వ్యాప్తంగా నేడు(ఆదివారం) జరిగిన ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్షకు 51 మంది గైర్హాజరయ్యారని జిల్లా సాంఘీక సంక్షేమ గురుకుల డీసీవో శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 1,851 మంది 1,800 మంది హాజరయ్యారని తెలిపారు. ఇందులో 5వ తరగతిలో 16 మంది, 6వ తరగతిలో 14 మంది, 7వ తరగతిలో 12 మంది, 8వ తరగతిలో ఐదుగురు, 9వ తరగతిలో నలుగురు గైర్హాజరు అయ్యారని వెల్లడించారు.

News February 23, 2025

అన్ని జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు: పీఎం మోదీ

image

వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ప్రారంభిస్తామని PM మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో బాగేశ్వర్ ధామ్ మెడికల్&సైన్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. క్యాన్సర్‌కు కారణమయ్యే సిగరెట్, బీడీ, పొగాకుకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. క్యాన్సర్‌తో పోరాడేందుకు బడ్జెట్‌లో కొన్ని ప్రకటనలు చేశామని, మందులు చౌకగా లభించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.

error: Content is protected !!