News February 8, 2025
సిద్దిపేట: గ్రామాల్లో మొదలైన ‘స్థానిక’ సందడి!
ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ఆశావాహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్యులను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.
Similar News
News February 8, 2025
ఢిల్లీలో బీజేపీ విజయంపై ఎంపీ అర్వింద్ హర్షం
ఢిల్లీలో బీజేపీ విజయం సాధించడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హర్షం వ్యక్తం చేశారు. తాను ప్రచారం చేసిన అసెంబ్లీ నియోజకవర్గాలు ఆర్కే పురం, జంగ్ పుర నుంచి బీజేపీ అభ్యర్థులు అనిల్ శర్మ, తర్వీందర్ సింగ్ విజయం సాధించడంతో శనివారం ఢిల్లీలో వారిని ఎంపీ కలిసి అభినందించారు. ఈ విజయాన్ని ప్రధాని మోడీకి అంకితం ఇస్తున్నట్లు అర్వింద్ పేర్కొన్నారు.
News February 8, 2025
కవిత వల్లే ఢిల్లీలో ఆప్ ఓటమి: కొండా సురేఖ
TG: BRS MLC కల్వకుంట్ల కవితతో కలిసి కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ చేయడం వల్లే ఆప్ ఎన్నికల్లో ఓడిపోయిందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. BRS పార్టీ ఎక్కడికెళ్లినా భస్మాసుర హస్తమేనని ఢిల్లీ ఎన్నికలతో తేలిపోయిందని ఎద్దేవా చేశారు. ‘ఢిల్లీ ఫలితాలనుద్దేశించి రాహుల్ గాంధీపై KTR వ్యాఖ్యలు అహంపూరితం. ఈ అహంకారాన్నిఅణచివేసేందుకే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారు’ అని ఆమె ఫైర్ అయ్యారు.
News February 8, 2025
ఉపఎన్నికల్లో అధికార పార్టీలదే హవా!
అయోధ్యలోని మిల్కిపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. ఎస్పీ అభ్యర్థి అజిత్ ప్రసాద్‌పై బీజేపీ క్యాండిడేట్ చంద్రభాను పాస్వాన్ 61,710 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఫైజాబాద్ లోక్‌సభ స్థానంలో ఓటమి తర్వాత ఈ విజయంతో బీజేపీకి ఊరట దక్కింది. మరోవైపు తమిళనాడు ఈరోడ్ ఈస్ట్ ఉపఎన్నికలో డీఎంకే అభ్యర్థి ఛాందీరకుమార్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు.