News March 15, 2025
సిద్దిపేట: గ్రూప్-3లో సత్తా చాటిన యువకుడు

తొగుట గ్రామానికి చెందిన ముచ్చర్ల శ్రీకాంత్ యాదవ్ గ్రూప్-3 ఫలితాలలో సత్తా చాటాడు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 232 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం గ్రూప్-4 ఆఫీసర్‌గా HMDAలో విధులు నిర్వహిస్తున్నాడు. తన ప్రిపరేషన్ కొనసాగిస్తూ గ్రూప్-1 సాధించి డీఎస్పీ అవ్వడమే తన లక్ష్యమని ముచ్చర్ల శ్రీకాంత్ తెలిపాడు.
Similar News
News March 15, 2025
ప్రకాశం జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ఎంతమంది రాస్తున్నారో తెలుసా?

ప్రకాశం జిల్లాలో ఈనెల 17వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 183 ఎగ్జామ్ సెంటర్లలో 29,602 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నట్లుగా డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. బాలురు 14,994 మంది, బాలికలు 14,608 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లుగా వెల్లడించారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు.
News March 15, 2025
జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి: BRS ఎమ్మెల్యేలు

TG: ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో హరీశ్ రావు, తలసాని, మాధవరం కృష్ణారావు, సబితారెడ్డి, సుధీర్ రెడ్డి, వివేకానంద ఆయనను కలిశారు. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ అన్యాయమని వారు పేర్కొన్నారు. స్పీకర్‌ను ఏకవచనంతో పిలవలేదని, సభా సంప్రదాయాలను ఆయన ఉల్లంఘించలేదని వారు తెలిపారు.
News March 15, 2025
MDK: అలర్ట్.. పిల్లలపై కన్నేసి ఉంచండి

మెదక్ జిల్లా వ్యాప్తంగా వేసవి తాపం నేపథ్యంలో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు ఉంటాయి. ఒంటిపూట బడులు అంటే పిల్లలకు సరదా.. చెరువుల్లో, నీటి వనరుల వద్దకు వెళ్తుంటారు. చిన్నారులు నీట మునిగి మృత్యువాత పడిన ఘటనలు ఎన్నో జరిగాయి. చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండి ఉన్నాయి. పిల్లల మీద పెద్దలు ఓ కన్నేసి ఉంచండి. SHARE IT..