News February 9, 2025
సిద్దిపేట: జాతీయ స్థాయి పోటీలకు జిల్లా విద్యార్థినులు
గత నెలలో తూప్రాన్‌లో నిర్వహించిన SGF అండర్ 14 సాఫ్ట్ బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నంగునూరు మండలం గట్ల, మల్యాల విద్యార్థినిలు ఈశ్వరి, అను జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులను హెచ్ఎం రమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు రాజకుమార్ అభినందించారు. వారు మాట్లాడుతూ 13 నుంచి 16 వరకు మహారాష్ట్రలో జరిగే పోటీల్లో ఈశ్వరి, అను పాల్గొంటారని తెలిపారు.
Similar News
News February 9, 2025
భువనగిరి: భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రద్దు
భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను నేటి నుంచి 20వ తేదీ వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ నుంచి కాజీపేట వరకు ప్రయాణించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట – ఖమ్మం – విజయవాడ మధ్య మూడో ట్రాక్ లైన్ పనుల కారణంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు, ప్రజలు గమనించగలరని కోరారు.
News February 9, 2025
రోడ్డుప్రమాదంలో తాడేపల్లిగూడెం మహిళ మృతి
ప్రత్తిపాడులో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో తాడేపల్లిగూడెం(M) కొండ్రుపోలుకు చెందిన లక్ష్మి మృతిచెందింది. భర్త సత్యనారాయణతో దువ్వలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ప్రత్తిపాడు హైవేపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె తలకు గాయమై చనిపోయింది. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI స్వామి తెలిపారు.
News February 9, 2025
NRIలు, NRTS సభ్యులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సభ్యులకు ఇకపై రోజుకు 100 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను TTD కేటాయించనుంది. అలాగే శ్రీవారి దర్శనం కోసం వచ్చే NRIలు, విదేశీయులకు సుపథం మార్గంలో రూ.300 కోటాలో దర్శనం కల్పించనుంది. స్టాంపింగ్ తేదీ నుంచి నెలలోపు దర్శనం కల్పించనుంది. ఒరిజినల్ పాస్‌పోర్టుతో ఉ.10 నుంచి సా.5 గంటలోపు వచ్చిన వారికి టోకెన్లు ఇస్తారు. బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల టైంలో టోకెన్లు ఇవ్వరు.