News March 1, 2025
సిద్దిపేట జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

సిద్దిపేట జిల్లాలో ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు సిద్దిపేటలో 32 నుంచి 33 °C ఉష్ణోగ్రతలు ఉంటాయని, రేపు 33 నుంచి 34 °C ఉష్ణోగ్రతలతో మేఘావృతమై ఉండనున్నట్లు వాతావరణ సూచనలు చెబుతున్నాయి. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News March 1, 2025
సంగారెడ్డి: ఉర్దూ మీడియం పాఠశాల వేళల్లో మార్పులు: DEO

రంజాన్ నెల సందర్భంగా సంగారెడ్డి జిల్లాలోని ఉర్దూ మీడియం పాఠశాల వేళల్లో మార్పులు చేసినట్లు జిల్లా విద్యాధికారి ఎస్. వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. ఉర్దూ మాధ్యమంలో చదివే విద్యార్థులకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పాఠశాలలు జరుగుతాయని చెప్పారు. ఈ మార్పులు రేపటి నుంచి అమలులోకి వస్తాయని ఈ విషయాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు గమనించాలని చెప్పారు.
News March 1, 2025
నాలుగోసారి సీఎంను.. ఏం చేయాలో దిక్కు తోచట్లేదు: సీఎం చంద్రబాబు

AP: అడవి పందులు తిన్నంత తిని పంటలను తొక్కేసి పోతాయని, ఐదేళ్ల వైసీపీ పాలన ఇలాగే సాగిందని CM CBN విమర్శించారు. ‘మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చా. 2014-19 కంటే ఎక్కువ చేస్తానని ప్రజలంతా అనుకుంటున్నారు. కానీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి అర్థమైంది. ఆర్థికంగా లోతైన గోతులున్నాయి. నాలుగోసారి CM అయిన నాకే ఏం చేయాలో దిక్కుతోచట్లేదు. కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నా’ అని తెలిపారు.
News March 1, 2025
ఏలూరు: రైలు ఢీకొని వృద్ధుడి మృతి

ఏలూరుకు చెందిన షేక్ చాన్ బాష (64) గన్ బజార్ సెంటర్ సమీపంలోని రైలు పట్టాలు దాటుతుండగా అటుగా వస్తున్న రైలు ఢీకొని శనివారం మృతి చెందాడు. ఈ ఘటనపై రైల్వే ఎస్ఐ పీ.సైమన్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఆయన చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతుడి కుటుంబీకులకు మృతదేహాన్ని అందిస్తామని ఎస్ఐ చెప్పారు.