News March 14, 2025
సిద్దిపేట జిల్లాలో బాలిక ఆత్మహత్య

జగదేవ్పూర్ మండలం మునిగడప గ్రామంలో కడుపునొప్పి భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నర్ర బాలేశం, నాగలక్ష్మి దంపతుల కుమార్తె ప్రవళిక(13) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లి నిన్న తిరిగొచ్చింది. కడుపునొప్పి వస్తుందని తల్లికి చెప్పి ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 14, 2025
మెదక్: హోళీ వేడుకలలో అదనపు కలెక్టర్

మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండగ తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ ఆనందోత్సవాలతో ఘనంగా జరుపుకోవాలని సూచించారు. హోలీ పండుగ ఐక్యతకు చిహ్నమని, జాతీయ సమైక్యతా భావంతో దేశంలో జరుపుకునే సంబరాల్లో హోలీ ఒకటన్నారు.
News March 14, 2025
మెదక్: పండగ పూట విషాదం.. యువకుడి ఆత్మహత్య

పెళ్లి సంబంధాలు కుదరడంలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. చిన్నశంకరంపేట మండలం మడూరుకు చెందిన ఫిరంగళ్ల శివరాజ్(24) గురువారం రాత్రి పొలానికి నీళ్లు చూడడానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో శివరాజు తండ్రి యాదగిరి పొలం వద్దకు వెళ్లి చూడగా వేప చెట్టుకు ఉరివేసుకొని కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసుల విచారణ చేపట్టారు.
News March 14, 2025
మెదక్: చిరుత పులి దాడిలో లేగ దూడలు మృతి..?

మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. రామాయంపేట మండలం దంతేపల్లి శివారులోని నక్కిర్తి స్వామి పొలం వద్ద పశువుల పాకపై అర్ధరాత్రి అడవి జంతువు దాడి చేసి రెండు దూడలను చంపేసింది. అయితే చిరుత దాడితోనే దూడలు మృత్యువాత పడ్డాయని బాధితులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. అయితే దాడి చేసింది ఏ జంతువు అనేది తెలియాల్సి ఉంది.