News February 13, 2025

సిద్దిపేట: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఇద్దరికీ 3రోజుల జైలు శిక్ష

image

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఇద్దరికీ మూడు రోజుల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కాంతారావు తీర్పునిచ్చారని సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ బుధవారం తెలిపారు. కొద్దిరోజుల క్రితం సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తాలలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఆరుగురిని పట్టుకున్నారు. వీరికి రూ.8వేల జరిమానా విధించగా.. ముగ్గురికి జైలు శిక్ష విధించారు.

Similar News

News February 13, 2025

ఏ క్షణమైనా నన్ను చంపేయొచ్చు: లావణ్య

image

TG: అమ్మాయిల జీవితాలతో మస్తాన్ సాయి ఆడుకున్నాడని హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య ఆరోపించారు. ‘పదుల సంఖ్యలో అమ్మాయిల వీడియోలు రికార్డ్ చేశాడు. ఏ క్షణమైనా నన్ను చంపేయొచ్చు. ప్రతిక్షణం భయంతో బతుకుతున్నా. నాకేం జరిగినా మస్తాన్ సాయి కుటుంబానిదే బాధ్యత. జీవితం, నా మనిషిని కోల్పోయా. రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకొని సారీ చెప్పాలనుకుంటున్నా. నాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగొద్దు’ అని లావణ్య అన్నారు.

News February 13, 2025

నాగర్‌కర్నూల్‌లో మహిళ దారుణ హత్య

image

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మహిళ దారుణ హత్యకు గురైంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో శాంతమ్మ(45)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు సమాచారం. అత్యాచారం చేసి హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సీఐ కనకయ్య విచారణ చేపట్టారు. ఈ ఘటన పట్టణంలో కలకలం రేపుతోంది.

News February 13, 2025

నాగర్‌కర్నూల్‌లో మహిళ దారుణ హత్య

image

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మహిళ దారుణ హత్యకు గురైంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో శాంతమ్మ(45)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు సమాచారం. అత్యాచారం చేసి హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సీఐ కనకయ్య విచారణ చేపట్టారు. ఈ ఘటన కలకలం రేపుతోంది.

error: Content is protected !!