News February 12, 2025
సిద్దిపేట: త్వరలో పెళ్లి.. అంతలోనే అనంతలోకాలకు
కుకునూరుపల్లి హనుమాన్ నగర్‌కి చెందిన గడ్డం గణేశ్(22) మంగళవారం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. SI శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గణేశ్‌కు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. కానీ తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని గణేశ్ తల్లిదండ్రులకు చెప్పగా వారు ఒప్పుకోలేదు. దీంతో మంగళవారం అర్ధరాత్రి ఫోన్ మాట్లాడివస్తానని ఇంటి బయటకు వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదైంది.
Similar News
News February 13, 2025
మొగడంపల్లి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మొగడంపల్లి మండలం చిరాగ్‌పల్లి SI రాజేందర్ రెడ్డి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. పక్కా సమాచారం మేరకు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 115 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఆర్టీఏ చెకోపోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుకొని స్వాధీనం చేసుకున్నామన్నారు. శివానంద్, వెంకట్, పాండు, ఓనర్ సిద్ధు, డ్రైవర్ సంగమేష్‌లపై కేసు నమోదు చేశామన్నారు.
News February 13, 2025
ములుగు: ఇసుక అక్రమ రవాణాపై ఎస్పీ నజర్
ములుగు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఎస్పీ శబరీశ్ ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్దేశించిన ప్రాంతాల్లో రుసుము చెల్లించి తవ్వకాలు చేపట్టాలన్నారు. జిల్లాలోని వాగులు, నది పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాల ప్రాంతాలను గుర్తించి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణా చేసిన, నిల్వ ఉంచిన చట్ట ప్రకారం జరిమానా, కేసులు నమోదు చేయాలన్నారు.
News February 13, 2025
MNCL: జాతీయ ఉపకార వేతనాలకు ఎంపికైన విద్యార్థులు
జాతీయ ఉపకార వేతనాలకు(NMMS) జన్నారం మండలం కిష్టాపూర్ జడ్పీఎస్ఎస్ విద్యార్థులు 11 మంది ఎంపికయ్యారని HM రాజన్న తెలిపారు. ఈ 11 మంది విద్యార్థులకు ఏటా రూ.12,000 చొప్పున స్కాలర్షిప్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. స్కాలర్షిప్ పరీక్షల్లో విజయం సాధించిన 11 మంది విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.