News February 25, 2025
సిద్దిపేట: దంచి కొడుతున్న ఎండ

సిద్దిపేట జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. ప్రతి ఏడాది మార్చిలో కనిపించే ఎండ ప్రభావం ఈ ఏడాది ముందుగానే కనిపిస్తోంది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సాధారణం కంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు, మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Similar News
News February 25, 2025
బంగారం కాదు వెండిని కొంటా: ఫేమస్ ఇన్వెస్టర్

వెండి తక్కువ ధరకు దొరుకుతోందని ఆథర్, కమోడిటీ గురువు జిమ్ రోజర్స్ అంటున్నారు. బంగారమంటే తనకెంతో ఇష్టమని, దాని విలువ అతిగా పెరిగిందని పేర్కొన్నారు. అందుకే తాను వెండిని కొంటానని చెప్పారు. ఎకానమీ మెరుగవుతోందని, మళ్లీ పరిశ్రమలకు దాని అవసరం పెరుగుతుందని అంచనా వేశారు. ఈ 2 మెటల్స్ అత్యంత విలువైనవని వివరించారు. అలాగే అగ్రి కమోడిటీస్‌పై దృష్టి పెడతానన్నారు. Note: ఈ వార్త సమాచారం కోసమే. పెట్టుబడి సూచన కాదు.
News February 25, 2025
జనగాం: ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించిన కలెక్టర్

జనగాం మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళల జీవన ఉపాధికి, ఆర్థిక స్వేచ్ఛకు క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. ఇంతటి విశాలమైన, శుభ్రమైన క్యాంటీన్ ప్రారంభించినందుకు మెప్మా లతాశ్రీ, ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌ను కలెక్టర్ అభినందించారు.
News February 25, 2025
జనగామ: యువత మత్తుకు బానిస కావొద్దు: కలెక్టర్

మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌తో కలిసి మత్తు పదార్థాల నియంత్రణపై విద్యా, వ్యవసాయ, ఎక్సైజ్, పోలీసు, వైద్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. యువత మత్తుకు బానిస కావొద్దని, ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలిపారు.