News March 26, 2025
సిద్దిపేట: ‘పట్టుదల, లక్ష్యం ఉంటే ఏదైనా సాధ్యమే’

పట్టుదల, స్పష్టమైన లక్ష్యం, నిర్దిష్టమైన ప్రణాళికతో కృషి చేస్తే సివిల్ సర్వీసెస్ పరీక్షలు సులభంగా పాస్ కావచ్చని సిద్దిపేట కలెక్టర్ ఎం.మనుచౌదరి పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేటలోని తెలంగాణ స్కిల్ & నాలెడ్జ్ సెంటర్, కెరీర్ అండ్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Similar News
News March 30, 2025
రంజాన్ లౌకికవాదానికి ప్రతీక: సీఎం రేవంత్

TG: ముస్లింలకు సీఎం రేవంత్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘రంజాన్ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దానధర్మాలు మానవాళికి ఆదర్శం. గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుంది’ అని తెలిపారు.
News March 30, 2025
పల్నాడు జిల్లా టుడే టాప్ న్యూస్

☞ నరసరావుపేట: ఉగాది వేడుకలలో పాల్గొన్న కలెక్టర్,ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యేలు ☞ అమరావతి: మద్యం సేవించి వ్యక్తి మృతి☞ రాజుపాలెం: నేతి వెంకన్నకు వెన్న సమర్పించిన భక్తులు ☞ రొంపిచర్ల: ప్రభల నిర్మాణంలో రాజకీయ వివాదం ☞ సత్తెనపల్లి: గడియార స్తంభం వద్ద అన్యమత ప్రచారంపై నిరసన☞ గురజాల: పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణకు డిమాండ్ చేస్తూ ఆందోళన ☞ వినుకొండ: పంచాంగ శ్రవణంలో పాల్గొన్న రాష్ట్ర చీఫ్ విప్
News March 30, 2025
నంద్యాలలో ఆకస్మిక తనిఖీలు

నంద్యాల పట్టణం నందమూరి నగర్‌లోని ఆవాసియ విద్యాలయాన్ని బుడగజంగాల రాష్ట్ర సమగ్ర శిక్ష ఐఈడీకో ఆర్డినేటర్ కల్పనా ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులను పరిశీలించారు. భోజనాలు, వసతులపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమె వెంట సీఆర్పిీ హిమశేఖర్, చంద్రమ్మ , గాయత్రి , హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.