News March 4, 2025

సిద్దిపేట: పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్: సీపీ

image

సిద్దిపేట జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరుగు (43) కేంద్రాల వద్ద 163 BNSS 2023 సెక్షన్ అమలు చేయనున్నట్లు పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ తెలిపారు. ఈ నెల 5 నుంచి 25 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సిద్దిపేట్ జిల్లాలోని (43) పరీక్ష కేంద్రాల వద్ద నిర్వహించనున్న నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద 500 మీటర్ల వరకు 163 BNSS 2023 అమల్లో ఉంటుదన్నారు.

Similar News

News March 4, 2025

కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా..!

image

గడచిన 24 గంటల్లో నుస్తులాపూర్, కొత్తపల్లి-ధర్మారం, ఈదులగట్టేపల్లి, ఖాసీంపేట, గుండి, గంగిపల్లి, మల్యాల 39.2°C, పోచంపల్లి, కరీంనగర్ 39.1, తాంగుల 39.0, ఇందుర్తి 38.9, గంగాధర 38.7, జమ్మికుంట, దుర్శేడ్ 38.6, వీణవంక 38.3, రేణికుంట 38.1, చిగురుమామిడి, బురుగుపల్లి, చింతకుంట 37.9, గట్టుదుద్దెనపల్లె 37.8, వెంకేపల్లి, ఆసిఫ్ నగర్ 37.6, బోర్నపల్లి 37.5, వెదురుగట్టు 37.2, తాడికల్ 35.7°C గా నమోదైంది.

News March 4, 2025

గద్వాల: కుటుంబ కలహాలతో మహిళ మృతి

image

మల్దకల్ మండలం అమరవాయికి చెందిన ఓ మహిళ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాలిలా.. గ్రామానికి చెందిన బుచ్చమ్మ(42), జమ్మన్న దంపతులకు ముగ్గురు సంతానం. వీరు కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. ఇటీవలే కుమారుడి వివాహం చేయగా, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో పాటు కుటుంబ కలహాలు ఉండటంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరులేనప్పుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

News March 4, 2025

నవరత్న కంపెనీలుగా IRCTC, IRFC

image

ప్రభుత్వ రంగ సంస్థలైన IRCTC, IRFCలకు నవరత్న హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతులు, ఆదాయ-లాభాల ఆర్జన ఆధారంగా కేంద్రం కంపెనీలకు ఈ హోదా ఇస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి IRCTC రూ.4270 కోట్ల వార్షిక ఆదాయం, IRFC రూ.26,644 కోట్ల ఆదాయాన్ని సాధించాయి. తాజాగా రెండు కంపెనీలు చేరడంతో ఈ హోదా కలిగిన సంస్థల సంఖ్య 26కు చేరుకుంది.

error: Content is protected !!