News March 19, 2025

సిద్దిపేట: పరీక్షా కేంద్రాల వద్ద BNSS 163 సెక్షన్ అమలు

image

సిద్దిపేట జిల్లాలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న 79 కేంద్రాల వద్ద 163 BNSS-2023 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సీపీ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 4 వరకు జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సిద్దిపేట్ జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. ఎగ్జామ్స్ సెంటర్ సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్స్ మూసి వేయాలని సూచించారు.

Similar News

News March 20, 2025

ధవలేశ్వరం: హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు

image

రూరల్‌లోని 2019లో ధవలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో కోర్టు ముద్దాయికి జీవిత ఖైదు, 5 వేల జరిమానా విధించింది. బుధవారం రాజమండ్రి కోర్టులో వాద ప్రతి వాదనలు విన్న తర్వాత జడ్జి విజయ్ గౌతమ్ ముద్దాయి దాడి గణేష్‌కు జీవిత ఖైదు విధించారు. భార్యపై అనుమానంతో దాడిచేసి చంపినట్లు రుజువైందని పీపీ లక్ష్మణ్ నాయక్ తెలిపారు. ధవలేశ్వరం సీఐ గణేష్, హెచ్సీ జయ రామరాజు ముద్దాయిని కోర్టులో హాజరు పరిచారు.

News March 20, 2025

కర్నూలు: ఈవీఎం వేర్ హౌస్‌ను పరిశీలించిన కలెక్టర్

image

త్రైమాసిక తనిఖీలో భాగంగా ఈవీఎంలు భద్రపరచిన వేర్ హౌస్‌ను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పరిశీలించారు. బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్ ఆవరణలోని ఈవిఎం వేర్ హౌస్‌లో ఈవీఎంలను భద్రపరచిన తీరును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న పోలీసు గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఈవీఎంలను భద్రతపై నిరంతర పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

News March 20, 2025

సంగారెడ్డి: RYV పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం తెలిపారు. ఒక రేషన్ కార్డుకు ఒకరు మాత్రమే అర్హులని చెప్పారు. ఉపాధి పథకం ద్వారా రూ.4 లక్షల వరకు రుణం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో 60 నుంచి 80% సబ్సిడీ ఉంటుందని వివరించారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

error: Content is protected !!