News February 5, 2025

సిద్దిపేట: బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఐదుగురు

image

BJP సిద్దిపేట జిల్లా దళపతి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం అధ్యక్ష పదవి రేసులో గంగాడి మోహన్ రెడ్డి, అంబటి బాలేష్ గౌడ్, గురువారెడ్డి, నల్ల శ్రీనివాస్, బైరి శంకర్ ముదిరాజ్ ఉన్నారు. బీసీలకు ఇవ్వాలని పలువురు నేతలు పట్టుపట్టినట్లు తెలుస్తోంది. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అధిష్ఠానం పెండింగ్‌లో పెట్టింది. పార్టీ పెద్దలు ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. దీనిపై మీ కామెంట్.

Similar News

News March 15, 2025

HYD: మారనున్న యూనివర్సిటీ పేరు.. హిస్టరీ ఇదే!

image

నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పుపై నేడు సభలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టనున్నట్లు సమాచారం. కాగా సరిగ్గా నలభై ఏళ్ల క్రితం 1985లో తెలుగు యూనివర్సిటీని NTR ప్రారంభించారు. దీనికే 1998లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీగా నామకరణం చేశారు.

News March 15, 2025

NZB: మోసాలకు గురవుతున్న వినియోగదారుడు!

image

మార్కెట్ ఏదైనా మోసాలకు గురవుతున్నది మాత్రం వినియోగదారుడే. తనకు జరిగిన అన్యాయాన్ని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదులు చేయకపోవడం వల్ల వ్యాపారుల అక్రమాలకు గురవుతున్నారు. న్యాయం చేయడానికి వినియోగదారుల ఫోరం కోర్టులు ఉన్నా ప్రజల అవగాహన లేమితో వినియోగించుకుంటోంది తక్కువే. నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. వినియోగదారుల హక్కులను తెలుసుకొని వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట వేయండి.

News March 15, 2025

ఇబ్రహంపట్నంలో దారుణ హత్య.. నిందితులు అరెస్ట్

image

ఇబ్రహంపట్నం ఫెర్రీలో శనివారం యువకుడు దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హతుడు కంచికచర్ల చెందిన వ్యక్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ GGHకు తరలించారు. నిందితులను అదుపులోకి తీసునన్నమన్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  

error: Content is protected !!