News February 25, 2025
సిద్దిపేట: మహిళా కానిస్టేబుల్ సూసైడ్

సిద్దిపేట జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ యాదాద్రి జిల్లాలో బలవన్మరణానికి పాల్పడింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరూకొలు గ్రామానికి చెందిన అనూష(26) భువనగిరిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ భువనగిరిలో నివాసం ఉంటున్నారు. తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News February 25, 2025
త్రిపురారం: గవర్నర్‌ని కలిసిన వస్రాం నాయక్

త్రిపురారం మండలం మాటూరుకి చెందిన భారత దివ్యాంగుల క్రికెట్ క్రీడాకారుడు ధనావత్ వస్త్రం నాయక్, NTA ప్రతినిధి ధనావత్ జగదీష్ నాయక్‌తో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మంగళవారం కలిశారు. వస్రాం నాయక్‌కి ఆటలపై మక్కువ పెరగడానికి గల కారణాలను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం దివ్యాంగులకు అందిస్తున్న ప్రోత్సాహకాలను ప్రచారం చేయాలని, భవిష్యత్తులో మరింత రాణించాలని ఆకాంక్షించారు.
News February 25, 2025
సంగారెడ్డి: ప్రజా పోరాటాల వేదిక జిల్లా కన్వీనర్‌గా రాజయ్య

ప్రజా పోరాటాల వేదిక జిల్లా కన్వీనర్‌గా రాజయ్యను సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో నిర్వహించిన సమావేశంలో మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజయ్య మాట్లాడుతూ.. తనను జిల్లా కన్వీనర్‌గా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తారని పేర్కొన్నారు. జిల్లా కన్వీనర్‌గా నియామకమైన రాజయ్యను సన్మానించారు.
News February 25, 2025
నల్గొండ జిల్లా టాప్ న్యూస్

⏭ దామరచర్లలో దొంగ నోట్ల కలకలం ⏭ పీఏ పల్లిలో మహిళా దారుణ హత్య ⏭ వైద్య సిబ్బందిని బెదిరిస్తే కేసులు: ఎస్పీ శరత్ చంద్ర పవర్ ⏭ రిజిస్టర్ ఓటర్లకు సెలవు: కలెక్టర్ ఇలా త్రిపాఠి ⏭ ఎయిడ్స్‌పై అవగాహన కలిగి ఉండాలి: డాక్టర్ సుచరిత ⏭ శివరాత్రికి ముస్తాబవుతున్న శివాలయాలు ⏭ గుర్రంపోడు ఎమ్మార్వోని సస్పెండ్ చేసిన కలెక్టర్