News February 25, 2025
సిద్దిపేట: యూనిఫాంలపై అదనపు కలెక్టర్ సమీక్ష

ప్రభుత్వ పాఠశాల, వివిధ రకాల గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు వచ్చే అకాడమిక్ సంవత్సరంలో స్కూల్ యూనిఫాం అందజేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గూర్చి జిల్లా అదనపు కలెక్టర్ గరిమ ఆగ్రవాల్ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని అధికారులు సమీక్ష నిర్వహించారు.
Similar News
News February 26, 2025
GWL: ‘విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి’

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల కేసులు అన్ని కోణాల్లో విచారించాలని, అలాగే రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలన్నారు.
News February 26, 2025
వరంగల్: MGM ఆస్పత్రి నుంచి పారిపోయాడు..!

వరంగల్ MGM ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఎవరికీ చెప్పకుండా పారిపోయాడు. ఈ విషయమై ఆస్పత్రిలో ఉన్న అతడి తల్లి లక్ష్మీ స్థానిక పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేసింది. భూపాలపల్లి జిల్లాకు చెందిన పద్మాకర్ అనారోగ్య రీత్యా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ తరుణంలో ఎవరికీ చెప్పకుండా ఎంజీఎం నుంచి పారిపోయాడు. ఎవరికైనా ఆచూకీ తెలిసినట్లయితే మాట్వాడ పోలీసులకు సమాచార ఇవ్వాలని కోరారు.
News February 26, 2025
ఖమ్మం: మోడల్ స్కూల్ ప్రవేశాలకు గడువు పెంపు

ఖమ్మం: తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును మార్చి 10 వరకు పొడిగించామని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు http://telanganams.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓసి విద్యార్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, బిసి, పిహెచ్‌సి, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు రూ.125 ఫీజు నిర్ధారించామని పేర్కొన్నారు.