News February 22, 2025
సిద్దిపేట: రంజాన్‌కు ఏర్పాట్లు చేయాలి: అదనపు కలెక్టర్

రంజాన్ నెల ప్రారంభం నుంచి రంజాన్ పండుగ ముగిసే వరకు చేయాల్సిన ముందస్తు ఏర్పాట్ల గురించి శనివారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్‌లో జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ అబ్దుల్ హమీద్ అధ్యక్షతన నిర్వహించారు. మార్చి మొదటి వారం రంజాన్ మాసం ప్రారంభం నుంచి రంజాన్ పండుగ ముగిసే వరకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Similar News
News February 23, 2025
హైదరాబాదీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్

హైదరాబాద్ వాసులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించగా.. తాజాగా మరికొన్నింటిని నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ బ్రిడ్జిలు, అండర్ పాస్‌లు నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో పనులకు జీహెచ్ఎంసీ టెండర్‌లకు ఆహ్వానించింది.
News February 23, 2025
ప్రజల పక్షాన నిలుస్తాం: కన్నబాబు

వైసీపీ ప్రజల పక్షాన నిలిచి ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతుందని ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కన్నబాబు వెల్లడించారు. ఆదివారం విశాఖ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితిలో ఉందని ఆరోపించారు. తాను నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
News February 23, 2025
కృష్ణా: పోలవరం లాకుల వద్ద ఇద్దరు గల్లంతు

కృష్ణా జిల్లాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. పోలవరం లాకులు కొమ్మూరు వద్ద నీటిలో పడి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వీరవల్లి ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ నాగూర్ బాషా (16), షేక్ షరీఫ్ (16) తన తండ్రితో కలిసి చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో వారు ఇద్దరూ కాలుజారి నీటిలో పడిపోయారు. వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ వారు మునిగిపోయారని పోలీసులు తెలిపారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.