News February 24, 2025
సిద్దిపేట: రాజీవ్ రహదారిపై యాక్సిడెంట్.. ఒకరి మృతి

చిన్నకోడూర్ మండలం మల్లారంలో రాజీవ్ రహదారిపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. అతడి తల పగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 24, 2025
డోర్నకల్: మార్గం మధ్యలో గుండెపోటుతో వ్యక్తి మృతి

డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో నల్ల ప్రభాకర్ (43) గుండెపోటుతో మృతి చెందాడు. కడుపు నొప్పి రావడంతో.. ఖమ్మంలో ఓ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో మార్గం మధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీనితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
News February 24, 2025
బాపులపాడు: యువకుల మృతికి కారణమిదే.!

పోలవరం కాలువలో చేపల వేటకు వెళ్లి ఇద్దరు యువకులు మృతిచెందిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం మేరకు.. కోడూరుపాడుకు చెందిన సుభానీ, జానీ కుమారులు నాగూర్ బాషా, షరీఫ్, సుభానీతో కలిసి చేపలకు వేటకు వెళ్లారు. చేపల గాలం చిక్కుకుపోవడంతో దాన్ని తీసేందుకు నాగూర్ బాషా వెళ్లగా, మునిగిపోతున్న సమయంలో పైకి లాగేందుకు షేక్ షరీఫ్ చెయ్యి ఇవ్వగా ఇద్దరు మునిగిపోయారు. బయటకు తీసేందుకు ప్రయత్నించినా అప్పటికే ప్రాణాలు విడిచారు.
News February 24, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలు.. 3 రోజులు మద్యం అమ్మకాలు బంద్

గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా 3 రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు మూసివేయనున్నారు.