News April 4, 2025

సిద్దిపేట: రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

image

సిద్దిపేట జిల్లాలో గల వరిధాన్యం కోనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి ఆదేశించారు. శుక్రవారం కోహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో కోనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఐకేపీ సెంటర్‌లలోనే వరిధాన్యం కోనుగోలుకు అవసరమైన పాడి క్లీనర్లు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు.

Similar News

News April 18, 2025

విశాఖలో దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ నైట్‌.. పోలీసుల సూచనలు

image

విశాఖ పోర్ట్ స్టేడియంలో శనివారం నిర్వహించే దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ నైట్‌కు వచ్చే వారికి పోలీసులు శుక్రవారం పలు సూచనలు చేశారు. వీఐపీ టికెట్లు ఉన్నవారికి మాత్రమే ప్రధాన గేటు ద్వారా ఎంట్రీ ఉంటుందన్నారు. వారి వాహనాలకు లోపల పార్కింగ్ చేసుకోవాలన్నారు. సాధారణ టికెట్లు ఉన్నవారికి పోర్ట్ స్టేడియం వెనుక గేటు నుంచి ప్రవేశం ఉంటుందన్నారు. వారి వాహనాలు నిర్దేశించిన ప్రదేశంలో పార్కింగ్ చేయాలన్నారు.

News April 18, 2025

GHMC పరిధిలో నమోదైన వర్షపాతం..!

image

HYDలో భారీ వర్షం కురుస్తుంది. అత్యధికంగా రెయిన్‌బజార్ యాకుత్‌పురాలో 56.5 మి.మీ, డబీర్‌పుర బలశెట్టి వాటర్ ట్యాంక్ వద్ద 48.5 మిమీ, దూద్‌బౌలి 46.5 మిమీ వర్షం నమోదైంది. గన్‌ఫౌండరీ, రూపాల్ బజార్ 2 చోట్లా 41 మిమీ, నాంపల్లిలో 40.5 మిమీ, అజంపురాలో 38.5 మిమీ, కంచన్‌బాగ్‌లో 36.8 మిమీ, ఎడిబజార్‌లో 33.3 మిమీ, కుత్బుల్లాపూర్ ఆదర్శ్‌నగర్‌లో 31.5 మిమీ వర్షపాతం కురిసింది.

News April 18, 2025

అమెరికా వైమానిక దాడి.. యెమెన్‌లో 74 మంది మృతి

image

యెమెన్‌లోని ఆయిల్ పోర్టుపై US చేసిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 74కు చేరింది. ఈ ఘటనలో 171 మంది గాయపడినట్లు హౌతీ గ్రూప్ వెల్లడించింది. నెలరోజులుగా జరుగుతున్న దాడుల్లో ఇదే అత్యంత దారుణమైన దాడి అని తెలిపింది. కాగా ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న నౌకలపై హౌతీల దాడులను ట్రంప్ సీరియస్‌గా తీసుకున్నారు. వారికి నరకాన్ని చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఆదేశాలతో US ఆర్మీ హౌతీలపై విరుచుకుపడుతోంది.

error: Content is protected !!