News February 8, 2025

సిద్దిపేట: రైతులకు లాభం చేకూర్చేందుకు దోహదపడాలి: కలెక్టర్

image

వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని రైతులకు అత్యధికంగా లాభం చేకూర్చేందుకు ఉపయోగ పడేలా విద్య నేర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి అన్నారు. శుక్రవారం సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల గ్రామ పరిధిలోగల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సందర్శించారు.

Similar News

News February 8, 2025

నేడే CCL ప్రారంభం.. గ్రౌండులో సత్తా చాటనున్న సినీ స్టార్లు

image

సెలబ్రిటి క్రికెట్ లీగ్(CCL) 11వ సీజన్ ఇవాళ ప్రారంభం కానుంది. మ.2 గంటలకు బెంగళూరు వేదికగా చెన్నై రైనోస్VSబెంగాల్ టైగర్స్, సా.6 గంటలకు తెలుగు వారియర్స్‌VSకర్ణాటక బుల్డోజర్స్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 2 వ‌ర‌కు ఈ టోర్నీ కొనసాగనుంది. తెలుగు, త‌మిళ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన స్టార్లు బ్యాట్, బంతితో సత్తా చాటనున్నారు. ఈ నెల 14, 15వ తేదీల్లో HYDలో నాలుగు మ్యాచులున్నాయి.

News February 8, 2025

ఫుడ్ పాయిజనింగ్ జరగలేదు: కలెక్టర్

image

వై.రామవరం మండలం చవిటిదిబ్బలు కస్తూర్బా పాఠశాలలో ఎటువంటి ఫుడ్ పాయిజనింగ్, నీటి కాలుష్యం జరగలేదని కలెక్టర్ దినేశ్ కుమార్ శుక్రవారం తెలిపారు. 14 మంది కస్తూర్బా విద్యార్థినులకు అస్వస్థత అంటూ వచ్చిన వార్తలపై కలెక్టర్ స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. 14 మంది విద్యార్థినులకు వేరు వేరు కారణాల వల్ల జలుబు, జ్వరం, దగ్గు, వాంతులు, విరేచనాలు కావడంతో చికిత్సకు ఆసుపత్రకి తరలించామని చెప్పారు.

News February 8, 2025

GREAT.. WGL: ఆశ్రమంలోనే అనాథల మధ్య పెళ్లి వేడుక

image

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీకి చెందిన అల్లూరి రంజిత్ రెడ్డి MBA పూర్తి చేసి ల్యాండ్ సర్వేయర్‌గా పని చేస్తున్నారు. ఆయన జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలంలో “మా ఇల్లు ఆశ్రమం”లో అనాథగా పెరిగిన విజేతను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోనే అనాథల మధ్య పెళ్లి వేడుక ఎంతో వైభవంగా నిర్వహించారు. వీరికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.

error: Content is protected !!