News February 11, 2025
సిద్దిపేట: వేర్వేరుగా ముగ్గురు ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739248553492_1243-normal-WIFI.webp)
సిద్దిపేట జిల్లాల్లో వేర్వేరుగా ముగ్గురు సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. కోహెడలో జీవితంపై విరక్తితో తిరుపతి రెడ్డి(50) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకోగా.. హుస్నాబాద్‌లో కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని రాజు(45) మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. గజ్వేల్ మండల పరిధిలో ఆర్థిక ఇబ్బందులతో రవీందర్(35) పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Similar News
News February 12, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739293116375_51263166-normal-WIFI.webp)
> కొడకండ్ల బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేతలు > పాలకుర్తిలో ఎన్నికలపై రివ్యూ నిర్వహించిన డిసిపి> ప్రేరణ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ > తీగారం దుర్గమ్మ ఆలయంలో చోరీ > ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధం టీపీసీసీ సభ్యులు అమృత రావు > కేటీఆర్‌ను కలిసిన తాటికొండ రాజయ్య > కేంద్ర నవోదయ విద్యాలయ సమితి కమిషనర్ ను కలిసిన ఎంపీ కడియం కావ్య.
News February 11, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు: అదనపు కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739282225106_50139766-normal-WIFI.webp)
పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసన మండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు.మంగళవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో మెదక్, నిజామాబాద్ అదిలాబాద్ , కరీంనగర్ గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల నిర్వహణకు విధులు కేటాయించిన పిఓలు, ఏపిఓలు, సెక్టార్, నోడల్ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.
News February 11, 2025
హైదరాబాద్‌లో రూ.20 లక్షల విలువైన విదేశీ సిగరేట్స్ సీజ్..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739279527236_52296546-normal-WIFI.webp)
హైదరాబాద్‌లో విదేశీ సిగరెట్ల గుట్టును కమిషనర్ టాస్క్‌ఫోర్స్, సౌత్ వెస్ట్ జోన్, హాబీబ్ నగర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో రట్టు చేశారు. రూ.20 లక్షల విలువైన విదేశీ సిగరేట్స్, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అఫ్సల్ నగర్, అగపురా రోడ్డులో ఓ గోదాంలో విదేశీ సిగరేట్స్ నిల్వ ఉంచారు. ఈ మేరకు నిందితులు ఇమ్రాన్, ఆయుబ్‌ను అరెస్ట్ చేశారు.