News April 4, 2025
సిద్దిపేట: ‘సమగ్ర ప్రణాళికతో వరి కొనుగోళ్లు జరపాలి’

యాసంగి 2024-25 సంబంధించిన వరి ధాన్యం సేకరణ ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా సాఫీగా నిర్వహించేందుకు గాను సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్ ఆదేశించారు. జిల్లాలోని వరిధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వహకులకు, మండల వ్యవసాయ & వ్యవసాయ విస్తరణ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
Similar News
News April 11, 2025
రోడ్డు భద్రతా నియమాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి: CP

సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధను సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారి క్రిస్టోఫర్ పురుషోత్తమ్ మర్యాద పూర్వకంగా కలిశారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా సీపీ అనురాధ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
News April 11, 2025
భద్రాద్రి: రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి.. కుమారుడికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందగా, కుమారుడికి తీవ్రగాయాలైన విషాద ఘటన భద్రాద్రి జిల్లా సుజాతనగర్ మండల కేంద్రంలో జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దినేశ్‌గా గుర్తించారు. ప్రస్తుతం కుమారుడు కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ములకలపల్లికి వలస వచ్చి కూలీ పనులు చేసుకుంటున్నారని స్థానికులు తెలిపారు.
News April 11, 2025
విశాఖ: దారి దోపిడీ చేసిన మైనర్‌ను పట్టుకున్న పోలీసులు

విశాఖలో దారి దోపిడీ చేసిన 17 ఏళ్ల మైనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు క్రైమ్ డీసీపీ లతా మాధురి శుక్రవారం తెలిపారు. ఈనెల 10న స్టీల్‌ప్లాంట్ పరిధిలో ఓ మైనర్ ర్యాపిడో రైడ్ బుక్ చేశాడు. తుమ్మగంటి కిషోర్ ఆ రైడ్ పిక్ చేసుకొని మైనర్‌ను తీసుకెళ్తుండగా నిర్మానుష ప్రదేశంలో వాహనం ఆపి డ్రైవర్‌ను కొట్టి రూ.48,100 లాక్కున్నాడు. కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీపీ ఆదేశాల మేరకు ఆ మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.