News May 5, 2024
సిద్దిపేట: సోషల్ మీడియాపై ప్రత్యేక సెల్
ఎంపీ ఎన్నికల నేపథ్యంలో షోషల్ మీడియాపై సిద్దిపేట కమిషనరేట్‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. సిద్దిపేటలో హోం మంత్రి అమిత్ షా, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై ఫేక్ ప్రచారం నేపథ్యంలో ప్రత్యేక దృష్టిసారించారు. ఈ టీం పార్టీల నేతలు, కార్యకర్తలు చేసే వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, X,యూట్యూబ్, రీల్స్ వీడియోలు, పోస్టులను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఫిర్యాదు చేస్తే చర్యలకు సన్నద్ధమవుతున్నారు.
Similar News
News November 19, 2024
పాపన్నపేట: బైక్ అదుపు తప్పి ఒకరు మృతి
వాహనం అదుపుతప్పి ఒకరు మృతి చెందిన ఘటన పాపన్నపేట మండలంలో జరిగింది. ఏఎస్ఐ సంగన్న తెలిపిన వివరాలు.. కొత్తపల్లి గ్రామానికి చెందిన బైండ్ల జశ్వంత్(19) అదే గ్రామానికి చెందిన స్నేహితుడితో కలిసి ఆదివారం రాత్రి బైక్‌పై పాపన్నపేటకు వెళ్లారు. తిరిగి వస్తుండగా యూసుఫ్ పేట గ్రామ శివారులో వాహనం అదుపుతప్పి కింద పడ్డారు. జశ్వంత్ మృతి చెందగా మరోకరికి గాయాలయ్యాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News November 19, 2024
కౌడిపల్లి: ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
కౌడిపల్లి మండల పరిధిలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను, పలు రైస్ మిల్లులను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు పరిశీలించి పలు రికార్డులను తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సిబ్బందికి సూచించారు. రైస్ మిల్లు వద్ద లారీలను వెంటనే దిగుమతి చేసుకొని తిరిగి పంపించాలని సిబ్బందికి సూచించారు.
News November 18, 2024
కొణతం దిలీప్ అరెస్టు.. తీవ్రంగా ఖండించిన హరీశ్‌రావు
తెలంగాణ మాజీ డిజిటల్ డైరెక్టర్ కొణతం దిలీప్‌ను పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన దిలీప్ కొణతంను అరెస్టు చేసిన పోలీసులు తెలిపారు. కొణతం దిలీప్ అరెస్టును హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత, ప్రతీకార చర్యలను మానుకోవాలని అన్నారు. దిలీప్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.